Pages

Friday, June 17, 2011

విద్యార్థులకు జగన్ హామీ

ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా) : స్వరాజ్ నగర్­లోని తమ హాస్టల్­ని ఊరి చివరకు తరలిస్తున్నారని విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్­తో మాట్లాడతానని జగన్ వారికి హామీ ఇచ్చారు.

Tuesday, June 14, 2011

అన్నదాత కన్నీటికి జవాబు ఏది?

{పతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి
‘మద్దతు’ లేక 40 లక్షల టన్నుల రబీ ధాన్యం ఇంకా పొలాల్లోనే ఉంది
రైతు నానా కష్టాలు పడుతున్నాడు
ఇలాగైతే అతడెలా బతకాలి? ఖరీఫ్‌కు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి?
సర్కారును నిలదీయాల్సిన తెలుగుదేశం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడింది
ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ పదవికి పోటీ పెట్టి రాజకీయం చేసింది
అసెంబ్లీలో స్పీకర్ పోటీపైనే మాట్లాడిందిగానీ.. రైతుల సమస్యల ప్రస్తావన లేదు

చిత్తూరు, న్యూస్‌లైన్: సాగు కోసం రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చిత్తూరు ‘సాగు పోరు’లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుంటే.. కనీస మద్దతు ధర అనే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే.. అన్నదాత ఎలా బతకగలడని ప్రశ్నించారు.

రైతన్నల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సాగు పోరు’ పేరుతో సోమవారం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించగా.. రైతన్నలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించని తెలంగాణ జిల్లాల్లో సైతం ధర్నాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ‘సాగు పోరు’ ధర్నాలో పాల్గొన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రైతన్నల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వానికి చూపడానికే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టంచేశారు. చెరుకు, మామిడి, పత్తి, వరి, మల్బరీ.. ఇలా అన్ని పంటల రైతులూ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నారంటూ వారి కష్టాలను ఆయన వివరించారు. రైతు మోములో చిరునవ్వు చెరిపేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగుచేయడంకన్నా.. ఉరే మేలన్న భావనలో రైతులు ఉన్నారన్నారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

చెరుకు, మామిడి రైతుకు దిక్కేది?

చైతన్య యాత్రల పేరుతో రైతులకు కౌన్సెలింగ్ చేయాలంటున్న రాష్ట్ర ప్రభుత్వానికే కౌన్సెలింగ్ అవసరం. వారి కళ్లకు రైతుల కష్టాలు కనబడ్డం లేదు. రైతుల అవస్థలను ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకే వారి సొంత జిల్లా అయిన చిత్తూరులో ధర్నాలో నేను పాల్గొంటున్నాను. వారిద్దరినీ నేను ప్రశ్నిస్తున్నా... రాష్ట్రం దాకా ఎందుకు ఈ జిల్లాలో చెరుకు రైతులు పడుతున్న కష్టాలు మీకు కనబడ్డం లేదా? చెరుకు రైతుకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన బకాయిలు కేవలం ఈ జిల్లాలోనే రూ. 16 కోట్లు ఉంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా? చెరకు క్రషింగ్ ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలైతే.. ఇప్పటికీ కనీస మద్దతు ధర ఎంతో చెప్పలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మామిడి రైతు సంగతి చూస్తే.. క్వింటాలు 20 వేలు పలుకుతున్న రోజులు చూశాం. కానీ ఇప్పుడు క్వింటాలురూ. 4 వేలు కూడా రాని పరిస్థితిలో రైతు అష్టకష్టాలు పడుతున్నాడు.

బీటీ కంపెనీలతో సర్కారు లాలూచీ

బీటీ పత్తి విత్తనాలను తీసుకుంటే.. రాష్ట్రంలో 98 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, 47 లక్షల ప్యాకెట్ల బీటీ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్యాకెట్ రేటు రూ. 1,800 ఉంటే.. సంబంధిత కంపెనీలతో కొట్లాడి ఆ ధరను రూ. 750కు తగ్గించేలా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీలతో లాలూచీ పడిపోయింది. అదే ప్యాకెట్‌ను రూ. 750కు మరో రూ. 180 అదనంగా చేర్చి కంపెనీలు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మల్బరీ సాగు గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వేళ కేజీ పట్టు గూళ్లు రూ. 300, రూ. 400 ఉంటే.. ఈ రోజు అవి రూ. 175కే పడిపోయినా.. వారి కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడ్డం లేదు. వేరు శెనగ రైతు దుస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

ఇలాగైతే రెతైలా బతకాలి?

విత్తనాల దగ్గర్నుంచి ఎరువుల దాకా.. ఎరువుల దగ్గర్నుంచి డీజిల్ దాకా రైతు పండిస్తున్న పంట మీద ప్రతి ఏడాదీ పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 60 శాతం పెట్టుబడి పెరిగింది.. మరోవైపు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలన్న బాధ్యతనే మరిచి ప్రవర్తిస్తోంది. తాను పండించిన పంటకు కనీస మద్దతు ధరే రాకపోతే.. ఆ రైతు ఎలా బతకగలడని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.

ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలి?

మొన్న రబీలో పండించిన ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో.. రైతు దాన్ని తక్కువ రేటుకు అమ్ముకోలేక, అమ్ముకుందామన్నా గోదాముల్లో స్థలం లేక, కొనే దిక్కు లేకపోవడంతో.. ఇలా దాదాపుగా 40 లక్షల టన్నుల దాకా ధాన్యం పొలాల్లోనే మిగిలిపోయింది. రబీలో పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. ఈ రైతు సోదరుడు ఖరీఫ్‌లో పంటకు ఎక్కడి నుంచి పెట్టుబడి తెస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడి ముఖాన, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు చూడాలన్న ఆలోచనను పక్కన పెట్టింది. ఇలా పక్కనబెట్టిన ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని నేను ప్రశ్నిస్తున్నా?

అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు?

కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని రైతు సమస్యలను గాలికొదిలేశాయి. రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనపై ఆనాడు చంద్రబాబు అసెంబ్లీలో 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం ప్రతిపాదించారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు 90 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా అసెంబ్లీలో అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదు? నలభయ్యేళ్ల చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా స్పీకర్ పదవికి పోటీ పెట్టని సంప్రదాయం మన రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఇటీవల స్పీకర్ పదవికి టీడీపీ పోటీ పెట్టి రాజకీయం చేసింది. రాజకీయం చేసి అసెంబ్లీలో ఆ స్పీకర్ ఎన్నికపైనే మాట్లాడిందికానీ.. రైతు సమస్యలపై ఒక్క మాటా మాట్లాడలేదు. మీ రాజకీయాలను దేవుడు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో మీ రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా దక్కవు. కుమ్మక్కయిన ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పేదవాని కన్నీటి బొట్లే సమాధానం చెబుతాయి. కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరులో తాము పడుతున్న కష్టాలను చెప్పుకోడానికి ఇంత మంది రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారంటే.. వారిద్దరికీ ఇప్పటికైనా సిగ్గు రావాలని, బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రైతులను ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.

వైఎస్ పాదయాత్ర ముగిసి నేటికి ఎనిమిదేళ్లు


16 నుంచి జగన్ వైఎస్ఆర్­జిల్లా పర్యటన

కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తారు. 16న తొండూరు, 18న సింహాద్రిపురం మండలాల్లో పర్యటిస్తారు. 17న ప్రొద్దుటూరు, 19న మైదుకూరు నియోజకవర్గాలలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.

Monday, June 13, 2011

రైతుల పరిస్థితి దుర్భరం: జగన్

చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారైనప్పటికీ ఇక్కడ రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతుపోరు కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రబీలో పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు. గూడౌన్లలో నిల్వ చేసుకునే అవకాశంలేదని, కొనేవాడు కూడా లేడని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు తాము పండించిన పంటని పోలాల్లోనే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల కన్నీటికి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి రైతు సోదరుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఇక్కడి రైతులు పడుతున్న బాధలను వివరిస్తూ కలెక్టర్­కు వినతి పత్రం ఇస్తానని చెప్పారు.

విత్తన వ్యాపారులతో ప్రభుత్వం లాలూచీపడిందని జగన్ ఆరోపించారు. తగినన్ని విత్తనాలు సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.90 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా, 40 లక్షలు మాత్రమే సరఫరా చేశారని చెప్పారు.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణయుగం నడుస్తున్నవేళ ప్రతిపక్ష నేత అయిన ఈ చంద్రబాబు నాయుడు గద్దె దింపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇవాళ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికల్లో పోటీ పెట్టే సాంప్రదాయంలేకపోయినా ఆ ఎన్నికని రాజకీయం చేశారని విమర్శించారు. ఆ రెండు రోజులు స్పీకర్ ఎన్నిక గురించిమాత్రమే మాట్లాడారని, ఒక్క రోజు కూడా రైతుల బాధల గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు

Monday, June 6, 2011

to day cartoon


Cartoon
07/06/2011
... ప్రతి పేదకు ఓ ల్యాండ్‌లైన్ ఫోనిచ్చి ధనవంతుల్ని చేద్దాం మేడమ్

Wednesday, June 1, 2011

రైతు వ్యతిరేక ప్రభుత్వమిది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
‘స్థానిక’ ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
ఈ నెల 15లోగా మండల, అసెంబ్లీ,
జిల్లా అడ్‌హాక్ కమిటీల నియామకం
15 నుంచి సభ్యత్వ నమోదు


హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు వ్యతిరేక సర్కారుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అన్నదాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబడుతూ.. ఈ సర్కారును కదిలించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టక తప్పదని చెప్పారు. బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన అధ్యక్షతన పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల సమావేశం జరిగింది. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఈ సమావేశం తీర్మానం చేసింది.

ముందుగా దివంగత నేత వైఎస్‌కు భేటీ నివాళులు అర్పించింది. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేసిన జగన్.. రాష్ట్రంలో రైతుల అధ్వాన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహానేత వైఎస్సార్ మరణించాక వరుసగా రెండు, మూడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. తాను ఇస్తానన్న సబ్సిడీలో పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేకపోయింది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంవల్ల మళ్లీ తాజా రుణాలు కూడా లభించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక రైతులు తాము వరి ధాన్యం పండించబోమని స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం విచారకరం.

ఇది ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేక పోయిందన్నారు. సుమారు 70 శాతం మంది ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. భేటీ అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులకు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఈ నెల 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఏదో ఒక జిల్లాలో ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.

అడ్‌హాక్ కమిటీల్లో అందరికీ స్థానం..

మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా అడ్‌హాక్ కమిటీలను ఈ నెల 15 లోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు అంబటి చెప్పారు. ‘ఆయా జిల్లాల అడ్‌హాక్ కన్వీనర్లు, ముఖ్య నేతలు, ఎన్నికల పరిశీలకులు సమష్టిగా చర్చించుకుని అడ్‌హాక్ కమిటీలోని సభ్యుల పేర్లను ఖరారు చేయాలని సూచించాం. అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా అన్ని సామాజిక వర్గాల వారినీ ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఇందులో స్థానం ఉంటుంది. ఈ కమిటీలను పార్టీ కేంద్ర పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) ఆమోదం మేరకు ప్రకటించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. కమిటీల నియామకం తర్వాత 15వ తేదీ నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇపుడున్న పార్టీల మాదిరిగా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను చేర్పించే విషయంలో వినూత్న పద్ధతిని అనుసరిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరతారు. రుసుం తీసుకుని, వారితో సంతకాలు చేయిస్తారు’ అని అంబటి వివరించారు.

ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి..

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలెప్పుడు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చినట్లు అంబటి తెలిపారు. అడ్‌హాక్ కన్వీనర్లు, ఎన్నికల పరిశీలకులు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని, ఇప్పటి నుంచే వారిని ఆ దిశగా నడిపించాలని కోరామని చెప్పారు. వివిధ అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది జూలై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశంలోనే వెల్లడిస్తామని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

అన్నదాతను ఆదుకోండి

ముఖ్యమంత్రికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం



13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరి శీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు జగన్
కనీస మద్దతు ధర ఇచ్చి 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి
ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ నుంచే
క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 200 పెంచాలి
ధాన్యం సేకరణలో పంజాబ్ విధానాన్ని అనుసరించాలి
2009-10కి సంబంధించిన వ్యవసాయ రుణాలపై
వడ్డీ భారం లేకుండా చూడాలని డిమాండ్
రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం తక్షణం చర్యలు
తీసుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడి
లేని పక్షంలో 13వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరిక
వినతి పత్రాన్ని సీఎంకు అందజేసిన పార్టీ ప్రతినిధులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కష్టాల సుడిలో చిక్కుకున్న అన్నదాతను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి, తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ తరహా విధానంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించాలన్నారు. అనూహ్యంగా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న మద్దతు ధర ను క్వింటాలుకు మరో రెండు వందల రూపాయలను ఈ సీజన్ నుంచే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని.. లేని పక్షంలో ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తానే స్వయంగా నిరసనలను నేతృత్వం వహిస్తానని చెప్పారు. అన్నదాతను ఆదుకునేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి పంపిన వినతిపత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం కిరణ్‌కు అందజేసింది.

‘రబీ పంటనే అమ్ముకోలేకపోతే అన్నదాతలు బ్యాంకుల రుణాలను ఎలా చెల్లిస్తారు? ఈ రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ కోసం రైతన్నకు కొత్త రుణాలను ఎవరిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి లేకుండా రైతులు ఖరీఫ్ పంట ఎలా వేయగలుగుతారు?’ అని సీఎంకు పంపిన వినతిపత్రంలో జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత విశ్వాసం కోల్పోతున్నాడని చెప్పారు. గతంలో ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని.. అయితే, ప్రస్తుత సంక్షోభానికి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ‘ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వ్యవసాయం చేస్తూ.. దేశ ఆహార భద్రతకు కొండంత అండగా నిలుస్తున్న అన్నదాతల జీవితాలతో ఆడుకోవడం తప్పుగా అనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చింది..

సీఎంతో భేటీ అనంతరం కొణతాల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు సరైన ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోతున్నారని, దీంతో ఎన్నడూ లేని విధంగా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని లెవీగా సేకరించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఆ ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం తరఫున సేకరించాలన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ‘దివంగత వై.ఎస్.హయాంలో రూ. 500 ఉన్న మద్దతు ధరను రూ. 1,000 వరకు తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడితే ఐకేపీ సంఘాలతో ధాన్యం సేకరించేలా చర్యలు చేపట్టి రైతులకు లాభం చేకూర్చేలా చూశారు. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించలేదు’ అని విమర్శించారు. పంట దిగుబడి ఎక్కువ వస్తే అందుకు అవసరమైన గోదాములు, గోనె సంచులను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ‘మహానేత వైఎస్సార్ ైరె తు సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. ఇప్పుడీ ప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవడం చూసి.. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులన్నింటినీ తాము ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఐ.రామకృష్ణంరాజు, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, పి.జనక్ ప్రసాద్, కుడిపూడి చిట్టబ్బాయ్, పోతల ప్రసాద్ తదితరులున్నారు.

ప్రధాన డిమాండ్లివీ..

ఠ రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్ల నిధులను కేటాయించాలి.
ఠ ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పంజాబ్ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను చేపట్టాలి. పంజాబ్‌లో పౌర సరఫరాల సంస్థ, సహకార సంస్థలు, ఆగ్రో పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ల ద్వారా రైతుల నుంచి నేరుగా 90 శాతం ధాన్యం సేకరిస్తున్నారు. అదే తరహాలో ఇక్కడా ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలి.
ఠ 2009 సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. రైతాంగానికి వంద శాతం ఇన్‌పుడ్ సబ్సిడీ ఇస్తామన్న మాటను తక్షణం నెరవేర్చాలి. అలాగే అవసరమైన చోట రుణాలను రీషెడ్యూలు చేయాలి. 2009-10 సంవత్సరానికి సంబంధించిన వ్యవ సాయ రుణాలపై వడ్డీ భారం లేకుండా చూడాలి.

ఠ ధాన్యం సేకరణతోపాటు నిల్వల కోసం రాష్ట్రంలో తక్షణం 40 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన గోడౌన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుని వీటిని అన్ని మండల కేంద్రాల్లో నిర్మించాలి. గోదాముల కొరత కారణంగా కూడా రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం తలచుకుంటే కేవలం రూ. 300 కోట్లతో ఆరు నెలల వ్యవధిలో మండల స్థాయిల్లో ఈ గోదాములను నిర్మించవచ్చు.

-కూలీల రేట్లతో పాటు సేద్యంలో అనూహ్యంగా పెరిగిన ఖర్చును దృష్టిలో ఉంచుకొని వరికి మద్దతు ధర ను క్వింటాలుకు మరో రూ. 200ను ఈ సీజన్ నుంచే పెంచాలి.
-కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వమే భరించాలి.

నమ్మకంతో బాధ్యతలు అప్పగించా: జగన్

హైదరాబాద్ : ‘‘మీ అందరి మీద ఎంతో నమ్మకంతో మీకు బాధ్యతలు అప్పగించాను. కష్టపడి పని చేయండి.మీరు పార్టీ తరపున చేయల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పార్టీ బాధ్యతలు నిర్వర్తించలేమని భావిస్తే ఇపుడే చెప్పండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందాం. అంతే గానీ బాధ్యతలు స్వీకరించి పార్టీ పని చేయకుండా ఉండొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు విస్పష్టంగా తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకులు, కేంద్ర పాలక మండలి సభ్యులను ఉద్దేశించి రెండో రోజు ప్రసంగిస్తూ ఎవరైనా పార్టీ చెప్పిన పనులు నిర్వహించలేమని భావిస్తే చేతులెత్తాలని కోరారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ఇపుడు చేస్తామని చెప్పి మధ్యలో మానుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, కనుక ముందే చెప్పాలని ఆయన కోరారు. పార్టీ నేతలను ప్రోత్సాహ పరుస్తూనే సభ్యత్వం, కమిటీల ఏర్పాటు వంటి విషయాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సున్నితంగా అన్నారు. అడ్‌హాక్ కన్వీనర్లకు పార్టీ వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉంటుందనీ అయితే అందరికీ ఆమోదయోగ్యంగా పనులు చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందనీ జగన్ అన్నారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా అడ్‌హాక్ కమిటీల్లో ఉండాల్సిన సభ్యుల కనీస సంఖ్య 6 లేదా 7 మంది ఉండాలనీ, గరిష్ట సంఖ్య 10 మంది ఉండాలనీ ఆయన సూచించారు. ఈ కమిటీల్లో సాధ్యమైనంత వరకూ అన్ని వర్గాలూ ఉండేలా చూడాలని కూడా ఆయన కోరారు. సభ్యత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల మాదిరిగా బోగస్‌వి ఉండరాదని ఆయన హెచ్చరించారు. కచ్చితంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం చే ర్పించాలనీ సభ్యత్వ రుసుము వారి వద్ద నుంచే వసూలు చేసి వారి సంతకాలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలా కాకుండా నాయకులు మొత్తం డబ్బులు తామే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చెల్లిస్తామంటే అంగీకరించబోమనీ ఆయన అన్నారు. సభ్యత్వ రుసుము వారి వద్ద తీసుకున్నపుడే పార్టీలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయనీ, వాటిని పార్టీ పటిష్టత కోసం మలుచుకోవాలని ఆయన పార్టీ నేతలతో అన్నారు.

తెలంగాణపై విస్పష్టమైన విధానం

తెలంగాణ విషయంలో పార్టీకి స్పష్టమైన వైఖరి ఉండాలని ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లా కన్వీనర్లు పి.జనక్ ప్రసాద్, కె.కె.మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి అధ్యక్షుడు జగన్‌కు సూచించారు. జనక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారనీ వారందరూ మన పట్ల సానుకూలంగా ఉన్నారనీ అన్నారు. వారి విశ్వాసం మరింతగా చూరగొనాలంటే తెలంగాణపై ఒక విధానం ప్రకటించడంతో పాటుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. అందుకు జగన్ స్పందిస్తూ కచ్చితంగా ఇడుపులపాయలో జరిగే ప్లీనరీలో వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు. 

Tuesday, May 31, 2011

జగన్‌కు జైకొట్టాల్సిందే..

వంగవీటి రాధాపై రంగా అభిమానుల ఒత్తిడి
విజయవాడ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధా మద్దతు ప్రకటించాలని రంగా అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు రాధా మేనమామ చెన్నుపాటి శ్రీనివాసరావు చెప్పారు.మంగళవారం నగరంలో సినీనటుడు కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా రంగా అభిమానులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వంగవీటి రాధా బొమ్మలతో భారీఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఉండటంతో రాధా జగన్‌కు జై కొడుతున్నారని నగరంలో పెద్దఎత్తున చర్చ జరిగింది. రాధాను మొదటి నుంచి అన్నీ తానై నడిపిస్తున్న ఆయన మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాలని అభిమానుల ఒత్తిడి ఇంతలా ఉంటుందని తాము ఊహించలేదనీ, త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేస్తామన్నారు.

మనసు విప్పి మాట్లాడండి

పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే.. నాయకులు ప్రతి ఒక్కరూ మనసు విప్పి తమ అభిప్రాయాలను వెల్లడించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి నాయకుడు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడే అన్ని విషయాల్లోనూ స్పష్టత ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పోయిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్రపాలక మండలి(సీజీసీ) తొలి సమావేశం మంగళవారమిక్కడ జరిగింది. ఉదయం 11 నుంచి నాలుగు గంటల పాటు పార్టీ సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశం చర్చించింది. అవిశ్వాస తీర్మానం, రైతుల సమస్యలు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలులాంటి అనేక కీలక అంశాలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రతి ఒక్కరూ ఆయా అంశాలను ప్రస్తావించి పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

సభ్యత్వ రుసుం పది రూపాయలు: పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు, నియోజకవర్గ ఇన్‌చార్జుల నియామకంపై సమావేశంలో చర్చించారు. సాధారణ సభ్యత్వంగా 10 రూపాయల రుసుము, క్రియాశీలక సభ్యులకు వంద రూపాయల రుసుముగా సమావేశంలో నిర్ణయించారు. అయితే మహిళలకు సాధారణ సభ్యత్వం 5 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం రూ. 50గా నిర్ధారించారు. సభ్యత్వ నమోదు ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై చర్చించడానికి బుధవారం జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, జిల్లా ఇంచార్జులతో సమావేశం నిర్వహించనున్నారు.

రైతు పక్షాన రాజీలేని పోరు

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసి వారికి అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి సమావేశం నిర్ణయించింది.
వివరాలు వెల్లడించిన కొణతాల, సోమయాజులు
క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితిలో ైరె తులుండటం బాధాకరం
ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం సాయాలకు దిక్కులేదు
దీనిపై సీఎంకు పార్టీ తరఫున లేఖ రాస్తాం
అసమర్థ సర్కారును
ఎవరు సాగనంపుతామన్నా మద్దతిస్తాం
తెలంగాణపై పార్టీ వైఖరిని ప్లీనరీలో ప్రకటిస్తాం
నెల రోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసి వారికి అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి తొలి సమావేశం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పాలక మండలి సమావేశమైంది. పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేక అల్లాడుతున్న రైతుల పరిస్థితిపై సమావేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలో ప్రధానంగా రైతుల సమస్యలపైనే చర్చించినట్లు పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. సహచర నేతలు డీఏ సోమయాజులు, జూపూడి ప్రభాకర్‌రావు, భూమా నాగిరెడ్డితో కలిసి సమావేశం వివరాలను కొణతాల మీడియాకు వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుందని, ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ విధానాలను పూర్తిగా వదిలి వేసిందని కొణతాల అన్నారు. వైఎస్‌కు వారసులమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆయనపై బురదజల్లడానికే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైఎస్ జీవించి ఉంటే అన్నదాతలకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రేషన్‌కార్డుకు 30 కిలోల బియ్యం అందజేసేవారని ఆయన స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై సీఎంకు లేఖ..

డీఏ సోమయాజులు మాట్లాడుతూ రైతు సమస్యలపై పార్టీ తరఫున సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక లేఖ రాస్తున్నామనీ, దానిని బుధవారం పత్రికలకు విడుదల చేస్తామని చెప్పారు. రైతులు వరి పండించకుండా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం వారి దీనస్థితికి అద్దం పడుతోందని, ఇది చాలా విచారకరమని ఆయన అన్నారు. వైఎస్ మృతి చెందిన తరువాత 2009 సెప్టెంబర్ నెల నుంచి వరుసగా మూడు నాలుగు ప్రకృతి వైపరీత్యాలకు రైతులు విలవిల్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటికి సంబంధించి ప్రధాని ప్రకటించిన సాయంగానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీగానీ, రుణాల రీషెడ్యూలింగ్ కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదన్నారు. వెయ్యి కోట్లు ఇస్తానన్న ప్రధాని రూ.500 కోట్లు ఇచ్చి సరిపుచ్చారన్నారు. మరో రూ.500 కోట్లు కేంద్రానికి రాష్ట్రం ఇవ్వాల్సిన మొత్తం నుంచి మినహాయించుకోవాలని సూచించారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. రీషెడ్యూలింగైతే ఒకటీ అరా బ్యాంకుల్లో తప్ప ఎక్కడా జరగలేదన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తెస్తూ లేఖ రాస్తామని సోమయాజులు వివరించారు.

వైఎస్ పథకాలు నభూతో..

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎవ్వరూ ఆలోచన కూడా చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేశారని, ఆ పథకాల భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో పడిందని కొణతాల అన్నారు. ఆ పథకాలను సంపూర్ణంగా కొనసాగించే ఉద్దేశంతో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకోసం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు, దౌర్భాగ్య పరిస్థితికీ నిదర్శనమన్నారు. అధిక దిగుబడి వల్లే ధాన్యాన్ని కొనిపించలేకపోతున్నామని సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనటం ప్రభుత్వ తీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. ఈ ఏడాది 139 లక్షల టన్నుల ధాన్యాన్నే కొనిపించలేకపోయారని, అదే వైఎస్ ఉన్నపుడు 143 లక్షల టన్నులను ఏ ఇబ్బందీ లేకుండా సేకరించారని తెలిపారు. కేంద్రం వైఖరితో రైతులకు వచ్చే ఏడాది రుణాలు అందే అవకాశం కనిపించడంలేదని ఆవే దన వ్యక్తంచేశారు.

అవిశ్వాసానికి మద్దతిస్తాం

రైతన ్నల సమస్యలపై ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా తమ పార్టీ మద్దతిస్తుందని కొణతాల తెలిపారు. చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే తాము ఆహ్వానిస్తామని, తమ బలాన్ని ఆ సమయంలో చూపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడే ఏ పక్షంతోనైనా కలుస్తామన్నారు.జగన్ ఏనాడూ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పలేదని, ఏ వర్గానికీ న్యాయం చేయలేని ఈ సర్కారుకు కొనసాగే నైతిక హక్కులేదనే అన్నారని గుర్తుచేశారు. తండ్రి కోసం మరణించినవారిని పరామర్శించాల్సిన నైతిక బాధ్యత జగన్‌పై ఉందని, అందుకే ఆయన ఓదార్పుయాత్ర అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగిస్తారని వెల్లడించారు.

సభ్యత్వ మాసోత్సవం..

గ్రామ గ్రామానికీ, గడప గడపకూ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడతామని కొణతాల వివరించారు. సభ్యత్వం ఎప్పుడు ప్రారంభించేదీ బుధవారం జిల్లా అడ్‌హాక్ కన్వీనర్ల సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఆ తరువాత ఒక తేదీని ఇచ్చి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయని, వీటిలో పార్టీ అన్ని అంశాలపైనా తన విధానాలను విస్పష్టంగా ప్రకటిస్తుందన్నారు. వ్యవసాయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్య, యువజన, మహిళా విధానాలన్నింటిపైనా పార్టీ వైఖరిపై ముసాయిదాలు రూపొందిస్తామన్నారు. ఈ విధానాలు రూపొందించేటపుడు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఉదాహరణకు వ్యవసాయ విధానంపై డాక్టర్ స్వామినాథన్, జయతీఘోష్ లాంటి వారి సలహాలు తీసుకుంటామన్నారు. ప్రతి విధానానికీఒక సబ్జెక్ట్ కమిటీ ఉంటుందన్నారు. తెలంగాణపై కూడా ప్లీనరీలో తమ పార్టీ విధానం ఏమిటో ప్రకటిస్తామని కొణతాల స్పష్టం చేశారు.

సిమెంట్ రోడ్డుకు విజయమ్మ భూమిపూజ

పులివెందుల :వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె సిమెంట్ రోడ్డు నిర్మాణానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మంగళవారం భూమి పూజ చేశారు. రూ.40 లక్షల పాడా నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

కాగా విజయమ్మ వారంలో మూడు రోజులపాటు నియోజకవర్గ ప్రజలుకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరితంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జూలై 8 నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేంత వరకు పోరాటాలు ఆగవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్‌ఆర్ పార్టీ సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశాలు పార్టీ కార్యాలయంలో ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 8, 9 తేదిల్లో ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు. ప్లీనరీ సమావేశాల్లోనే విధి విధానాల ప్రకటన చేస్తామన్నారు. మరో పదిరోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమౌతుందని.. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుందని కొణతాల తెలిపారు.

Monday, May 30, 2011

హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్

హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకుని నగరానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

విజయనగరం జిల్లాలో ముగిసిన ఓదార్పుయాత్ర

విజయనగరం: జిల్లాలో రెండవ విడత ఓదార్పు యాత్ర ముగిసింది. ఈ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి 18 కుంటుంబాలను ఓదార్చారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వందకుపైగా విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ యాత్ర 950 కిలో మీటర్లకుపైగా సాగింది.

జగన్ యాత్ర నిర్వహించిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆయనని చూసేందుకు తరలివచ్చారు. ఆయన రాక ఆలస్యం అయినా మండుటెండని కూడా లెక్కచేకుండా వేచి ఉండటం విశేషం. జగన్ లో జనం ఆ మహానేతని చూసుకుంటున్నారు.

విజయనగరంలో జరిగిన ముగింపు సభకు ఇసుకవేస్తే రాలనంతమంది జనం వచ్చారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మేడలపైన, మిద్దెలపైన ఎటుచూసినా జనమే జనం.

రైతు కన్నీరే మరణశాసనం

టీడీపీ, కాంగ్రెస్‌లకు వైఎస్ జగన్ హెచ్చరిక

సువర్ణ యుగంలో ప్రతి ఒక్కరికీ వైఎస్ ఉన్నారన్న భరోసా ఉండేది
వైఎస్ మరణించి రెండేళ్లవుతున్నా ప్రజలకు భరోసా ఇచ్చే నేతలే
కరువయ్యారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించి పేదల నడ్డి విరుస్తోంది
నాడు చంద్రబాబు 46 మంది
ఎమ్మెల్యేలతో వైఎస్ సువర్ణయుగంపై అవిశ్వాసం పెట్టారు
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా.. అవిశ్వాసం ెపెట్టనంటున్నారేం?
ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి..
బాబూ... నిజంగా ప్రజలపై
ప్రేమే ఉంటే అవిశ్వాసం నోటీసివ్వు..
ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చెయ్!

విజయనగరం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: రైతులు, పేదల సమస్యలు కనీసం పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు.. ఆ రైతులు, పేదల కన్నీటి బొట్టే మరణ శాసనం రాస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డి విరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వమనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుం టారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నావు..? అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబు నాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ఒక్కటి చెప్తున్నా ఇవాళ... పేదవాడి కళ్లనుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు కాం గ్రెస్, టీడీపీలకు మరణ శాసనం రాస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత 7 రోజుల ఓదార్పు యాత్ర సోమవారం విజయనగరం పట్టణంలో ముగి సింది. ఏడో రోజు యాత్ర ఉదయం కొమరాడ, పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాల మీదుగా రాత్రి 9 గంటలకు జగన్ విజయనగరం చేరుకున్నారు. పట్టణంలోని కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు జనం అంచనాలకు మించితరలివచ్చారు. అటు సింహాచలం మేడ నుంచి శంకరమఠం వరకు ఇటు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి సత్యా లాడ్జి వరకు రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అప్పుడెందుకు అవిశ్వాసం పెట్టావ్..

అయ్యా చంద్రబాబూ.. దివంగత మహానేత సువర్ణ పాలన సాగుతున్న రోజుల్లో కేవలం 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టావు. ఆయన్ను గద్దె దింపాలని ప్రయత్నించావు. ఇవాళ మీకు 90 మంది శాసన సభ్యుల బలం ఉం ది... ఇవాళ ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే పెట్టవేం చంద్రబాబూ?.. ఎందుకు పెట్టవంటే నువ్వు ఆ అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యావు కాబట్టి.

ఈ డిమాండ్లు నెరవేర్చమని అడగండి..: చంద్రబాబు నాయుడూ నిజంగా నీకు ప్రజలపై ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెడతానని ప్రభుత్వాన్ని బెదిరించి ప్రజా సమస్యలు పరిష్కరించు. రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రావాలంటే కనీసం రూ.,2000 కోట్లు అవసరం. మీరు ప్రభుత్వానికి వారంరోజుల గడువిచ్చి రైతాంగానికి కావలసిన రూ.2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. లేదం టే అవిశ్వాసం పెడతానని హెచ్చరించండి. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి పేద కుటుం బంలో కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి, డాక్టరో.. ఇంజనీరో.. అయితే ఆ కుటుంబంలో పేదరికం పోతుందని వైఎస్సార్ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపెడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే అధ్వాన్న పరిస్థితి వచ్చింది.. ఆ పథకానికి బకాయిలతో కలిపి రూ.6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

మొత్తం 6,800 కోట్లు ఇవ్వకపోతే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబూ? ప్రతి అక్కా, చెల్లెమ్మల మొఖాల్లో చిరునవ్వులు చూడ్డానికి వైఎస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి బకాయిలతో కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది. ఇవాళ నేనడుగుతున్నా.. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి ఇంకో రూ.1,600 కోట్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైకి ఇది చేతగాని ప్రభుత ్వం అం టూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తారు, లోపల కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటారు.

అప్పుడు భరోసా ఉండేది: ‘వైఎస్సార్ సువర్ణ పాలనలో రైతుల ధ్యాసంతా కూడా వ్యవసాయం చేయడంపైనే ఉండేది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థాయిలో ధాన్యం ఎలా పండించాలని ఆలోచించేవారు. ఇవాళ ధాన్యం అమ్ముడుపోతుందా లేదా అని భయపడని రోజులు లేవు. వైఎస్ హయాంలో మద్దతు ధరకంటే రూ.200 ఎక్కువకే అమ్ముడుపోయిన రోజులు చూశాం. ఏ సమస్య వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడన్న భరోసా ప్రతి రైతుకూ ఉండేది. ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రతి పేదవాడికీ కూడా.. ఇవాళ కాకపోతే రేపు నాకు ఓ పక్కా ఇల్లు కచ్చితంగా వస్తుందన్న భరోసా ఉండేది. ప్రతి అవ్వా ప్రతి తాతా కూడా వయసు పెరిగే కొద్దీ.. అయ్యో నేను ఎలా బతకాలీ అనే ఆలోచన నుంచి.. ఒక సంవత్సరం పెరిగితే ఏముందిలే.. అన్నీ చూసుకోడానికి మా ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడన్న భరోసా ఉండేది.. ప్రతి తల్లీ అనుకునేదీ నా కొడుకు.. నా కూతురు మరో నాలుగేళ్ల తరువాత డాక్టరో.. ఇంజనీరో.. అవుతారు, ముసలి వయసులో మమ్ములను ఆదుకుంటారని. కారణం ఏమంటే వైఎస్ సీఎం స్థానంలో ఉన్నారనే భరోసా ఉండేది. విద్యార్థులకు తాను చదువు కచ్చితంగా పూర్తి చేయగలనన్న నమ్మకం ఉండేది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 108 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి బతికిస్తుందన్న భరోసా ఉండేది.

ఇప్పుడేదీ ఆ భరోసా?: జనహృదయనేత వైఎస్ మరణించి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పేదలకు, రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, దేవుడు అనే వాడు ఉన్నాడు. పై నుంచి అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలక పక్షం నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.’

Sunday, May 29, 2011

అభిమాన సంద్రం from sakshi


Next Photo
 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పట్ల జనానికి ఉన్న అభిమానం ముందు ఎండ ధాటి కూడా వెలవెలబోతోంది. ఎండ చురుక్కు మనిపిస్తున్నా, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, దాహార్తితో డస్సిపోతున్నా... వారికవేవీ పట్టడం లేదు. మహానేత తనయుడు తమ కళ్లముందుకు రానున్నారన్న వాస్తవాన్ని స్మరించుకుని తదేకంగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టి మురిసిపోతున్నారు. వయస్సు తేడాను మర్చిపోయి ఆయనకు జేజేలు పలుకుతున్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలివి.బలిజిపేట : మహిళలను పలకరిస్తున్న 
గాదలవలసలో ఓ మహిళ అభిమానం
సీతారాంపురం : వృద్ధురాలికి ఆటోగ్రాఫ్
చినమేరంగి : చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు
పిరిడిరోడ్డు : వ్యవసాయ కార్మికులతో మాట్లాడుతూ...
లక్ష్మీపురం సర్పంచ్ వెంకటరమణను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
బి.వి.పురం: సభలో మాట్లాడుతున్న చంద్రశేఖరరాజు


చిలకాం : సభలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి

పిరిడిరోడ్డు : బస్సులో నుంచి చిన్నారుల అభివాదం

మిర్తివలస : ఆంజనేయుని వేషధారణతో అభిమాని స్వాగతం

జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పలుకుతున్న ద్వారపురెడ్డి సత్యనారాయణ కుటుంబం

జగన్‌ను అభాసుపాలు చేయడానికే...: అంబటి

హైదరాబాద్: యువనేత జగన్మోహన్‌రెడ్డిని అభాసుపాలు చేయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మకైనాయని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి తప్పు చేశామని మహానాడులో చంద్రబాబు తెలుపడం కాంగ్రెస్ పార్టీతో బాబు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని ఆయన విమర్శించారు.

మాజీ కేంద్రమంత్రి రాజా, కనిమొళిలా జగన్‌ను జైలుకు పంపిస్తామని చంద్రబాబు చెంచాలు మాట్లాడం చూస్తూంటే కాంగ్రెస్‌తో కుమ్మకైనారని అర్ధమౌతోందని ఆయన అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటల్నే తెలుగుదేశం పార్టీ వల్లవేస్తోందన్నారు. చంద్రబాబు మేకవన్నే పులి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్మద్ పటేల్‌తో బాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు.

ఆలస్యమైనా... అదే అభిమానం




ఓదార్పు యాత్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఓవైపు మండుతున్న ఎండలు.. ఇంకోవైపు జన తాకిడితో గంటల తరబడి ఆలస్యమవుతున్న ఓదార్పు యాత్ర.. అయినా అలసట ఎరుగకుండా జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మబంధువు మన పల్లెకు వస్తున్నారనే కబురు తెలియడమే ఆలస్యం.. మహిళలు ఇంటికి తాళం వేసి, పసి పిల్లలను సైతం చంకన వేసుకొని మండుటెండలో చెమటలు గక్కుతూ నడిరోడ్డుపైనే నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే హారతిపట్టి ఆశీర్వదిస్తున్నారు. అవ్వలు.. తాతలైతే ఒంట్లో సత్తువనంతా కూడ తీసుకొని జనంలో ముందు వరసలో నిలబడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఐదో రోజు శనివారం ఓదార్పు యాత్ర బొబ్బిలి మండలం పిరిడి గ్రామం నుంచి మొదలైంది. అక్కడి నుంచి శివడవలస, పెదపెంకి మీదుగా బలిజపేట మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తర్వాత యాత్ర మిర్తివలస, చింతాడ, కలవరాయి, జానుమల్లు వలస మీదుగా సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. గాదెల వలస కోటసీతారామపురం, రంగంపల్లి, పణుకుపేట, చినభోగిల మీదుగా సీతానగరం మండల కేం ద్రం చేరింది. ఇక్కడ భారీ ఎత్తున హాజరైన ప్రజ లను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అక్కడి నుంచి బూర్జ, పెద అంకాలాం, బీవీపురం, గరుగుబిల్లి చిలకాం చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు యాత్ర పూర్తయిన తర్వాత చిలకాంలో ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంట్లో జగన్‌మోహన్‌రెడ్డి బస చేశారు. శనివారం మొత్తం 12 వైఎస్సార్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.

ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి

జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణించే దారిలో ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి. దయానిధిపాలెం ఓదార్పు యాత్ర సాగిపోతున్న దారికి అర కిలో మీటర్ దూరంలో ఉంది. గ్రామస్తులంతా పిల్లా పాపలతో కలిసి రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికి సమయం సరిగ్గా మధ్యాహ్నం రెండు అవుతోంది. వారు ఉదయం 11 గంటలకే రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డారట. అంత ఎండలోనూ వైఎస్సార్ తనయుడిని చూసిన తరువాతే వెళ్లారు. గాదెలవలస గ్రామం యాత్ర షెడ్యూల్‌లో లేదు. లేకపోయినప్పటికీఊరు ఊరంతా ఏకమై వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. దాదాపు మూడు వేల మంది జనం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇక్కడ విగ్రహం ఉందని కనీసం యాత్ర నిర్వాహకులకు కూడా తెలియదు. గ్రామస్తుల పట్టుదలకు ఎంపీ ముగ్దుడయ్యారు. ఈ పల్లెలు మాత్రమే కావు, రంగంపేట, పణుకు పేట, కాశాపేట, పూనుబుచ్చింపేట.. ఇలా ప్రతి గ్రామం రోడ్డు మీదకు వచ్చి ఆత్మబంధువుకు ఆహ్వానం పలికింది.

శనివారం జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెలే జీ బాబురావు, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మో హన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు సర్రాజు, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు నిర్మలా కుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడి నాగేశ్వర్ రావు తదితరులున్నారు.

వైఎస్ యుగంలో రైతుకు భరోసా ఉండేది

ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్య

రైతుకు.. మద్దతు ధర వస్తుందన్న విశ్వాసం ఉండేది
వైఎస్ పాలనలో విద్యార్థికి.. చదువు పూర్తిచేస్తాననే నమ్మకముండేది
తల్లిదండ్రులకు.. తమ పిల్లలు పెద్ద చదువులు చదివి
తమను పోషిస్తారనే ధీమా ఉండేది
వైఎస్ చనిపోయాక ఒక్కనేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు
ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు
మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు

బలిజపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: జనహృదయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగంలో ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు, ప్రతి అక్కా ప్రతి చెల్లెకూ భవిష్యత్తుపై భరోసా ఉండేదని, నేడు రాష్ట్రంలో ఆ భరోసా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ సువర్ణ యుగంలో రైతులకు ఓ భరోసా ఉండేది. పండించిన పంటకు గిట్టుబాటు వస్తుంది.. మద్దతు ధర కంటే రెండు వందల ఎక్కువరేటు వస్తుందన్న భరోసా ఉండేది.. ఈవాళ కాకపోయినా మరో ఆరు నెలలకైనా ప్రాజెక్టులు పూర్తయి నా పొలంలోకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఎకరా రూ. 30, రూ. 40 వేలు ఉన్న పొలం రెండు, మూడు లక్షల రూపాయల రేటు పలుకుతుందనే భరోసా ఉండేది. ప్రతి విద్యార్థికీ తాను తన చదువు పూర్తిచేస్తానన్న నమ్మకం ఉండేది. తల్లిదండ్రులకు తమ కుమారుడు మరో నాలుగేళ్లలో తన విద్యను పూర్తిచేసి ఇంజనీరింగో, డాక్టరో చదివి లేదంటే.. చివరకు ఫ్యానుకింద కూర్చొనే ఉద్యోగమైనా చేసి వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడనే ధీమా ఉండేది. కారణం ఏమిటంటే దివంగత మహానేత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడనే భరోసా వారికుండేది. ఆయన మరణించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఈవాళ ఏ ఒక్క నేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజు బొబ్బిలి, బలిజపేట, సీతానగరం మండలాల్లోని గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. బలిజపేట, సీతానగరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైఎస్సార్ బతికున్న రోజుల్లో రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవని, ఇప్పుడు రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ బతికించు దేవా అని వేడుకుంటున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

మన ఖర్మకొద్దీ చంద్రబాబు..

‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వం అనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుంటారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నారు.. అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబూ.. అంటే పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ప్రజా డిమాండ్లు తీర్చకపోతే అవిశ్వాసం పెడతామనండి..

చంద్రబాబునాయుడు గారూ.. గత 18 నెలల కాలంగా రైతు సోదరులు ఆరుసార్లు దెబ్బ మీద దెబ్బ తిన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రావాలంటే రూ. 2000 కోట్లు అవసరం. మీరు వారంరోజుల గడువిచ్చి ఆరూ. 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. లేదంటే అవిశ్వాసం పెడతానని బెదిరించండి. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద ప్రభుత్వం గతేడాది రూ. 3400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది మరో రూ. 3400 కోట్లు కావాలి. మొత్తానికి రూ. 6800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

అవిశ్వాసం పెడతామని.. ఆ 6800 కోట్లూ విడుదలయ్యేలా చేయండి. ప్రతి అక్కా, చెల్లెమ్మ మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలని దివంగత మహానేత పావలా వడ్డీ రుణాలను తెచ్చారు. ఈ పథకానికి గతేడాదివెయ్యి కోట్ల బకాయిలున్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. మొత్తానికి రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. ఇదే చంద్రబాబు.. ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి రూ. 2 వేల కోట్లు కావాలని అడగండి. లేకుంటే మరో వారం రోజుల గడువు తీసుకొని మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చెప్పండి. కానీ మీరలా ఎందుకు చెప్ప లేకపోతున్నారు? కారణం ఏమంటే చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారు.

మీ తప్పును కప్పిపుచ్చుకోడానికి..

శాసన సభలో మీకు 90 మంది శాసనసభ్యుల బలం ఉంది.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో వైపు వేలు చూపిస్తారా? ప్రతి పేదవాడి ఉసురు ఈ చంద్రబాబు నాయుడుకు, ఈ ప్రభుత్వానికి తగిలి ఆ అగ్నిజ్వాలల్లో మాడిపోతారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు, చంద్రబాబు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు.

మిగతా నేతలంతా దొంగ నోటులే
గరుగుబిల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ ఒక పిట్టకథ చెప్పారు. ‘ఒక రైతు వంద రూపాయల నోటు తీసుకొని కూరగాయల కోసమని దుకాణానికి పోయాడు. కావల్సిన కూరగాయలు కొని తన చేతిలో ఉన్న వంద నోటును దుకాణం యజమానికి ఇచ్చారు. ఆ యజమాని నోటును చూసి ఇది దొంగ నోటని, దీన్ని నాకు అంటగడతావా అని రైతును అడిగాడు. మరి మంచినోటు ఎలా ఉంటుందీ అని అమాయక రైతు అడిగితే.. వైఎస్‌ఆర్‌లాగ నికార్సుగా ఉంటుంది, దొంగనోటు మిగిలిన నేతల్లా ఉంటుంది అని చెప్పాడు’ అంటూ కథను ముగిస్తుండగా.. జనం హర్షాతిరేకాలతో అభిమానం చాటుకున్నారు.

వైఎస్‌ఆర్ పాలన సువర్ణ యుగం: జగన్

గుమ్మలక్ష్మిపురం:రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగమని.. రాజశేఖరరెడ్డి సువర్ణపాలనలో రైతులు ఏనాడు కూడా బాధలు పడలేదన్నారు. రైతుల్లో రాజశేఖరుడు ఉన్నాడనే భరోసా వుండేదన్నారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే ధాన్యం అమ్ముకున్నారన్నారు.

విజయనగరం జిల్లాలో ఆరవ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా గుమ్మలక్ష్మిపురంలో ఏర్పాటు చేసిన సభలో జననేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

దివంగత నేత పాలనలో తన కూతురు డాక్టరవుతారనే ఆశ, కొడుకు ఇంజినీరింగ్ అవుతాడన్న కోరిక ప్రతి తండ్రి కళ్లలో కనిపించేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచును లక్షాధికారిని చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేశారన్నారు.

గుమ్మలక్ష్మిపురంలో ఎండలు మండుతున్నప్పటికి యువనేతకోసం ప్రజలు రోడ్లపై ఎదురుచూస్తు నిలుచున్నారు. జననేత చూసేందుకు జనం ఎగబడ్డారు. జగన్ యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ప్రజల నుంచి స్పందన వెలువడింది.

Wednesday, May 25, 2011

విజయనగరం news

సీతారాముల సేవలో జగన్
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన రామతీర్థంలోని శ్రీసీతారామస్వామిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ గల బేడాలో ఆయన ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పది మంది అర్చకులు జననేత పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పాదాలచెంత ఉంచిన పూలమాలలను జగన్‌మోహన్ రెడ్డితో పాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజులకు వేశారు.

గర్భగుడి పక్కన ఉన్న ఉత్సవ మూర్తుల వద్ద జననేత పేరిట పూజలు చేసి, ఆయనను ఆశీర్వదించారు. ఆలయ విశేషాలను స్థానిక సిబ్బంది జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. అభివృద్ధి పనులను సిబ్బంది వివరించినపుడు సబ్బం హరి, కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ ఉత్తర రాజగోపుర నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమయ్యాయని ప్రశ్నించారు. సాంబశివరాజు హయాంలోనే ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి ఈ నిధులను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రామతీర్థం దర్శనానికి వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సుమారు అరగంట సేపు పూజలు జరిపించిన జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేంత వరకు వారు నిరీక్షించారు. వచ్చిన తర్వాత జననేతకు జేజేలు పలుకుతూ అభివాదం చేశారు.

వైఎస్ బతికుంటే సస్యశ్యామలం.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే సుజల స్రవంతి ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర జిల్లాలు సస్యశ్యామలమయ్యేవని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడా ప్రాజెక్టును ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై కడప ఎంపీ నిప్పులు చెరిగారు. మహానేత వైఎస్సార్ మహోన్నత ఆశయంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే...ప్రస్తుత పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. అనేక సంక్షేమ పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిపోతే బాగుంటుందని ప్రజలు భావిస్తుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలనుకుంటే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు. అవిశ్వాసం పెడితే జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తారోనన్న భయం పట్టుకుందన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న తాము స్వార్థపూరిత రాజకీయాలు చేయబోమని, సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల దృష్ట్యా అవిశ్వాసంపై నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ధాన్యం మద్దతు ధర, కొనుగోలు, విద్యార్థుల చదువులకు కేటాయించాల్సిన నిధులు...మహిళలకు చెల్లించాల్సిన పావలా వడ్డీపైన ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యవహరించాలని సూచించారు. అంతకీ స్పందించకపోతే అధికార పార్టీకి, ప్రతిపక్ష టీడీపీకి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు గద్దె దించుదామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలు ఎన్నికలొస్తే డిపాజిట్లు రాకుండా ఆ రెండు పార్టీలను బంగాళాఖాతంలోకి తోసేస్తారని జగన్‌మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈ సభలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, తాడ్డి వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సింగ్‌బాబు, గొర్లె వెంకటరమణ, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు, మొయిద ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను కలిసిన నాయకులు
 ఓదార్పుయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి భోగాపురంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బుధవారం ఉదయం పూసపాటిరేగ మండలంలో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ సమయంలో ఉదయం 7గంటలకు పలువురు సన్‌రే విలేజ్‌కు చేరుకున్నారు. ముందుగా ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందించారు.

తరువాత ఎంపీ సబ్బం హరి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి సాంబశివరాజు, కాకినాడ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మి దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నడిమల్లి శేషారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కలిశారు.

రాజమండ్రి మాజీ మేయరు ఎంఎస్ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మాజీ ఎంపీపీ బి.సుదర్శనరాజు, విశాఖకు చెందిన ఎంఎస్‌ఆర్ ఎస్టేట్స్ ఎండీ ఎం.శ్రీనివాసరాం, తాండవ చైర్మన్ పి.గణేష్, జామి మాజీ ఎంపీపీ కాకర్లపూడి సూరిబాబురాజు, కె.కె.వి.ఎన్.వర్మ, విశాఖపట్నం 17, 43వ వార్డుల సభ్యులు కె.అప్పారావు, హణుక్, విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ టెక్‌నో మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, ఎలమంచిలి నుంచి న్యాయవాది కె.జగదీష్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
జగన్‌తోనే వైఎస్ పాలన సాధ్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన స్వర్ణ యుగపు పాలన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని నెల్లిమర్ల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆ పార్టీ నాయకులు సింగుబాబు, గొర్లె వెంకటరమణ అన్నారు. మండలంలో మల్యాడ, సతివాడ, నెలిమర్లలో ఓదార్పు యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మంత్రిని చేశారని వారు గుర్తు చేశారు.

అటువంటి బొత్స వైఎస్‌ఆర్ తనయుడైన జగన్‌మోహనరెడ్డిని కడప ఉప ఎన్నికల్లో ఓడించడానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వెళ్లడం ఆయన కృతజ్ఞహీనమైన వ్యక్తో ఇదో నిదర్శనమని ఎద్దేవా చేశారు. బొత్స వెళ్ల బట్టే జమ్మలమడుగులో జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మోజార్టీ వచ్చిందని చెప్పారు. నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావూరి శంకరరావు, ఆదాడ మోహనరావు, జనాప్రసాద్ ప్రసంగించారు. మొయిద ఎంపీటీసీ సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాగా
కొమరాడ రూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగ వేస్తోంది. ప్రధానంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీ, సీపీఎం నాయకులు కూడా పార్టీలోకి చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఎంపీపీ తాడంగి దమయంతితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు బుధవారం వైఎస్సార్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో మలివిడత ఓదార్పుకు అడుగిడిన వేళ కాంగ్రెస్, టీడీపీ సీపీఎం నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు.
దివంగత నేత వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి స్థాపిం చిన చేసిన పార్టీని గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రజలు, గిరిజనులు ఆదరిస్తున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర రెడ్డి, ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ తాడంగి దమయంతి, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఇద్దరు ఇండిపెండెంట్లు, టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు చేరారు. మండలంలో 14 ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మండలంలో 27 పంచాయతీల్లో కాంగ్రెస్‌కు చెందిన17 మంది సర్పంచ్‌లు, సీపీఎంకు చెందిన ఆరుగురు సర్పంచ్ లు ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారు.

టీడీపీకి చెందిన నలుగురు సర్పంచ్‌ల్లో ఇప్పటికే ఒకరు చేరగా, మరో సర్పంచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ బౌల్డ్ చేసినట్లేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ మండలంతోపాటు కురుపాం నియోజకవర్గానికి చెందిన కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలసలు కూడా అదే బాటలో నడుస్తాయి. ఈ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగిడే నాటికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని ఆయా పార్టీ నాయకులే అంటున్నారు.
‘ఓదార్పుయాత్రకు తరలిరండి’
బొబ్బిలి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో ఈ నెల 27న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రకు తరలి రావాలని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరంచనున్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆయనతో పాటు తూముల రామసుధీర్ తదితరులు బుధవారం పరిశీ లించారు.

పట్టణంలో అమ్మిగారి కోనేటి గట్టు, పిరిడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాలను వారు పరిశీలించారు. పిరి డి, జగన్నాథపురం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రలో పంపాన శ్రీనివాసరావు, తేలు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో జగన్ మోహన్‌రెడ్డి అభిమానులు బర్ల వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో ఓదార్పుపై ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఐవీ రమణమూర్తి, ఐవీఆర్ ఆండాళ్ ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి ( అనంతపురం )

: రాష్ట్రం లేదా నియోజకవర్గాలు అభివృద్ధి చెం దాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చౌళూరు రామక్రిష్ణారెడ్డి పే ర్కొన్నారు. బుధవారం స్థానిక హస్నాబాద్‌లో టీడీపీకి చెందిన ఇలియా జ్, చాంద్‌బాషా, రెహమాన్, హుస్సేన్, రహంతుల్లా, కలీద్, ఆసీఫ్‌తోపా టు వంద మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామక్రిష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ కొనసాగిం చాలంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.

నియోజకవర్గ ఎమ్మె ల్యే, ము న్సిపల్ చైర్మన్ పురం అభివృద్ధిని విస్మరించారన్నారు. రాబోవు ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. హస్నాబాద్‌లో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని వాపోయా రు. మెరుగైన సౌకర్యాలు, మెరుగైన అభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ మహానేత హిందూపురం పట్టణానికి రూ.650 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య తీర్చారన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలోకి చేరామన్నారు. కార్యక్రమంలో అన్వర్, ముస్తాఫా, చోటు, ఆటో దాదు, బాబు, రెహమాన్, ఫయాజ్, కౌన్సిలర్ సమీవుల్లా, చాంద్‌బాషా, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌కు జై కొట్టిన అవనిగడ్డ పీఆర్పీ

అవనిగడ్డ (కృష్ణా), న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పీఆర్పీ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై అసంతృప్తికి గురైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి అవనిగడ్డలో సమావేశమయ్యారు. సీనియర్ నేత బోయిన వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 90శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 500మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ మనోభావాలను నిస్సంకోచంగా వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం తపిస్తున్న జగన్మోహనరెడ్డికి మద్దతుగా నిలవడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. మండల స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం వెలువరించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్ కార్యకర్తలకు తెలిపారు. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

జగన్‌కు న్యాయవాదుల అధ్యక్షుడి మద్దతు

విజయనగరం, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ సోదరుడు, జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రవికుమార్ బుధవారం జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. భోగాపురం వద్ద జగన్ బస చేసిన అతిథి గృహానికి ఆయన రాగా.. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆయన్ను కడప ఎంపీకి పరిచయం చేశారు.

భారీగా వలసలు: ఓదార్పు యాత్ర రెండో రోజైన బుధవారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వచ్చి జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొవ్వాడలో సర్పంచ్ పి.రామినాయుడు, ఉప సర్పంచ్ కొడ్ల పార్వతి ఆధ్వర్యంలో రెండు వేల మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సతివాడలో ఒమ్మి సర్పంచ్ అంబాళ్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 200 మంది పార్టీలో చేరారు.

అవిశ్వాసంపై బాబుకు జగన్ సవాల్


మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు,
ఫీజుల పథకం కోసం రూ. 6,800 కోట్లు,
పావలా వడ్డీకి రూ. 2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి
సర్కారు వాటిని తీర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాసానికి మేం మద్దతిస్తాం

నెల్లిమర్ల నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి:సం క్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇక ఎంత మాత్రం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతూ నోటీసులు ఇవ్వాలని అన్నారు. ‘చంద్రబాబు గారూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. నేనడుగుతున్నా.. మీకు నిజంగా పేద ప్రజలపై ప్రేమే ఉంటే.. ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి. రైతులకు మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాలని, పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ. 6,800 కోట్లు ఇవ్వాలని, అక్కా చెల్లెళ్ల మొహాల్లో చిరునవ్వు చూడ్డానికి అవసరమైన పావలా వడ్డీ పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. ప్రజల సంక్షేమం కోసం ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాస తీర్మానానికి అవసరమైతే మేం మద్దతు పలుకుతాం’ అని జగన్ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర రెండో రోజు బుధవారం ఆయన పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలో ఉణుకూరు అప్పారావు కుటుంబాన్ని ఓదార్చారు. మొయిద జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ను పంపించాలని వేడుకుంటున్నారు: ‘మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మహానేత బతికి ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అన్ని ప్రాజెక్టులూ పూర్తయ్యేవి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవి. ఇప్పుడు.. రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ పంపించు దేవుడా అని వేడుకునే పరిస్థితి వచ్చింది.

బాబుకు నిజంగా ప్రేమే ఉంటే: ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదల నడ్డి విరగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాంటి సర్కారును చొక్కా పట్టుకుని అడుగుతారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే.. ఆయన మాత్రం మొసలి కన్నీళ్లతోనే సరిపెడుతున్నారు. చంద్రబాబు గారూ.. రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్ట పోతున్నారు. మీకు వారిపై నిజంగా ప్రేమ ఉంటే.. మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కచ్చితంగా కేటాయించి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. గతేడాది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటులో ప్రభుత్వం రూ. 3,400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది పథకం అమలుకు మరో రూ. 3,400 కోట్లు అవసరం. రెండూ కలుపుకుంటే రూ. 6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభత్వం కేవలం మూడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. చంద్రబాబుగారూ విద్యార్థులపై మీకు నిజంగా ప్రేమ ఉంటే.. పేద విద్యార్థుల చదువు కోసం రూ. 6,800 కోట్లు కావాలని మీరు డిమాండ్ చేయండి! ప్రతి అక్కా, చెల్లి మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలి. ఈ పథకంలో గత ఏడాది రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు గారు మీరు డిమాండ్ చేయండి.. పావలా వడ్డీ పథకానికి రూ.రెండు వేల కోట్లు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని... ఈ డిమాండ్లతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి.. ప్రభుత్వం వీటిని నెరవేర్చిందా సరే.. లేనిపక్షంలో అవసరమైతే మీకు మేం మద్దతిస్తాం.

బాబుపై భయం లేదు: చంద్రబాబు రోడ్డెక్కి చేతగాని ప్రభుత్వమని మాట్లాడతారేగానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఎందుకంటే.. బాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయాయి. ఈ ప్రభుత్వం చంద్రబాబు అవిశ్వాసం పెడతారేమో.. అని భయపడటం లేదు. ఆయన అవిశ్వాసం పెడితే జగన్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో...ఏమో..! అని భయపడుతోంది. పేద ప్రజల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోక పోయినా, ప్రతిపక్షం పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.