Pages

Sunday, May 29, 2011

అభిమాన సంద్రం from sakshi


Next Photo
 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పట్ల జనానికి ఉన్న అభిమానం ముందు ఎండ ధాటి కూడా వెలవెలబోతోంది. ఎండ చురుక్కు మనిపిస్తున్నా, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, దాహార్తితో డస్సిపోతున్నా... వారికవేవీ పట్టడం లేదు. మహానేత తనయుడు తమ కళ్లముందుకు రానున్నారన్న వాస్తవాన్ని స్మరించుకుని తదేకంగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టి మురిసిపోతున్నారు. వయస్సు తేడాను మర్చిపోయి ఆయనకు జేజేలు పలుకుతున్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలివి.బలిజిపేట : మహిళలను పలకరిస్తున్న 
గాదలవలసలో ఓ మహిళ అభిమానం
సీతారాంపురం : వృద్ధురాలికి ఆటోగ్రాఫ్
చినమేరంగి : చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు
పిరిడిరోడ్డు : వ్యవసాయ కార్మికులతో మాట్లాడుతూ...
లక్ష్మీపురం సర్పంచ్ వెంకటరమణను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
బి.వి.పురం: సభలో మాట్లాడుతున్న చంద్రశేఖరరాజు


చిలకాం : సభలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి

పిరిడిరోడ్డు : బస్సులో నుంచి చిన్నారుల అభివాదం

మిర్తివలస : ఆంజనేయుని వేషధారణతో అభిమాని స్వాగతం

జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పలుకుతున్న ద్వారపురెడ్డి సత్యనారాయణ కుటుంబం

జగన్‌ను అభాసుపాలు చేయడానికే...: అంబటి

హైదరాబాద్: యువనేత జగన్మోహన్‌రెడ్డిని అభాసుపాలు చేయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మకైనాయని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి తప్పు చేశామని మహానాడులో చంద్రబాబు తెలుపడం కాంగ్రెస్ పార్టీతో బాబు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని ఆయన విమర్శించారు.

మాజీ కేంద్రమంత్రి రాజా, కనిమొళిలా జగన్‌ను జైలుకు పంపిస్తామని చంద్రబాబు చెంచాలు మాట్లాడం చూస్తూంటే కాంగ్రెస్‌తో కుమ్మకైనారని అర్ధమౌతోందని ఆయన అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటల్నే తెలుగుదేశం పార్టీ వల్లవేస్తోందన్నారు. చంద్రబాబు మేకవన్నే పులి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్మద్ పటేల్‌తో బాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు.

ఆలస్యమైనా... అదే అభిమానం




ఓదార్పు యాత్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఓవైపు మండుతున్న ఎండలు.. ఇంకోవైపు జన తాకిడితో గంటల తరబడి ఆలస్యమవుతున్న ఓదార్పు యాత్ర.. అయినా అలసట ఎరుగకుండా జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మబంధువు మన పల్లెకు వస్తున్నారనే కబురు తెలియడమే ఆలస్యం.. మహిళలు ఇంటికి తాళం వేసి, పసి పిల్లలను సైతం చంకన వేసుకొని మండుటెండలో చెమటలు గక్కుతూ నడిరోడ్డుపైనే నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే హారతిపట్టి ఆశీర్వదిస్తున్నారు. అవ్వలు.. తాతలైతే ఒంట్లో సత్తువనంతా కూడ తీసుకొని జనంలో ముందు వరసలో నిలబడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఐదో రోజు శనివారం ఓదార్పు యాత్ర బొబ్బిలి మండలం పిరిడి గ్రామం నుంచి మొదలైంది. అక్కడి నుంచి శివడవలస, పెదపెంకి మీదుగా బలిజపేట మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తర్వాత యాత్ర మిర్తివలస, చింతాడ, కలవరాయి, జానుమల్లు వలస మీదుగా సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. గాదెల వలస కోటసీతారామపురం, రంగంపల్లి, పణుకుపేట, చినభోగిల మీదుగా సీతానగరం మండల కేం ద్రం చేరింది. ఇక్కడ భారీ ఎత్తున హాజరైన ప్రజ లను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అక్కడి నుంచి బూర్జ, పెద అంకాలాం, బీవీపురం, గరుగుబిల్లి చిలకాం చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు యాత్ర పూర్తయిన తర్వాత చిలకాంలో ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంట్లో జగన్‌మోహన్‌రెడ్డి బస చేశారు. శనివారం మొత్తం 12 వైఎస్సార్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.

ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి

జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణించే దారిలో ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి. దయానిధిపాలెం ఓదార్పు యాత్ర సాగిపోతున్న దారికి అర కిలో మీటర్ దూరంలో ఉంది. గ్రామస్తులంతా పిల్లా పాపలతో కలిసి రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికి సమయం సరిగ్గా మధ్యాహ్నం రెండు అవుతోంది. వారు ఉదయం 11 గంటలకే రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డారట. అంత ఎండలోనూ వైఎస్సార్ తనయుడిని చూసిన తరువాతే వెళ్లారు. గాదెలవలస గ్రామం యాత్ర షెడ్యూల్‌లో లేదు. లేకపోయినప్పటికీఊరు ఊరంతా ఏకమై వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. దాదాపు మూడు వేల మంది జనం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇక్కడ విగ్రహం ఉందని కనీసం యాత్ర నిర్వాహకులకు కూడా తెలియదు. గ్రామస్తుల పట్టుదలకు ఎంపీ ముగ్దుడయ్యారు. ఈ పల్లెలు మాత్రమే కావు, రంగంపేట, పణుకు పేట, కాశాపేట, పూనుబుచ్చింపేట.. ఇలా ప్రతి గ్రామం రోడ్డు మీదకు వచ్చి ఆత్మబంధువుకు ఆహ్వానం పలికింది.

శనివారం జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెలే జీ బాబురావు, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మో హన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు సర్రాజు, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు నిర్మలా కుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడి నాగేశ్వర్ రావు తదితరులున్నారు.

వైఎస్ యుగంలో రైతుకు భరోసా ఉండేది

ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్య

రైతుకు.. మద్దతు ధర వస్తుందన్న విశ్వాసం ఉండేది
వైఎస్ పాలనలో విద్యార్థికి.. చదువు పూర్తిచేస్తాననే నమ్మకముండేది
తల్లిదండ్రులకు.. తమ పిల్లలు పెద్ద చదువులు చదివి
తమను పోషిస్తారనే ధీమా ఉండేది
వైఎస్ చనిపోయాక ఒక్కనేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు
ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు
మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు

బలిజపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: జనహృదయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగంలో ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు, ప్రతి అక్కా ప్రతి చెల్లెకూ భవిష్యత్తుపై భరోసా ఉండేదని, నేడు రాష్ట్రంలో ఆ భరోసా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ సువర్ణ యుగంలో రైతులకు ఓ భరోసా ఉండేది. పండించిన పంటకు గిట్టుబాటు వస్తుంది.. మద్దతు ధర కంటే రెండు వందల ఎక్కువరేటు వస్తుందన్న భరోసా ఉండేది.. ఈవాళ కాకపోయినా మరో ఆరు నెలలకైనా ప్రాజెక్టులు పూర్తయి నా పొలంలోకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఎకరా రూ. 30, రూ. 40 వేలు ఉన్న పొలం రెండు, మూడు లక్షల రూపాయల రేటు పలుకుతుందనే భరోసా ఉండేది. ప్రతి విద్యార్థికీ తాను తన చదువు పూర్తిచేస్తానన్న నమ్మకం ఉండేది. తల్లిదండ్రులకు తమ కుమారుడు మరో నాలుగేళ్లలో తన విద్యను పూర్తిచేసి ఇంజనీరింగో, డాక్టరో చదివి లేదంటే.. చివరకు ఫ్యానుకింద కూర్చొనే ఉద్యోగమైనా చేసి వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడనే ధీమా ఉండేది. కారణం ఏమిటంటే దివంగత మహానేత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడనే భరోసా వారికుండేది. ఆయన మరణించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఈవాళ ఏ ఒక్క నేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజు బొబ్బిలి, బలిజపేట, సీతానగరం మండలాల్లోని గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. బలిజపేట, సీతానగరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైఎస్సార్ బతికున్న రోజుల్లో రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవని, ఇప్పుడు రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ బతికించు దేవా అని వేడుకుంటున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

మన ఖర్మకొద్దీ చంద్రబాబు..

‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వం అనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుంటారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నారు.. అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబూ.. అంటే పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ప్రజా డిమాండ్లు తీర్చకపోతే అవిశ్వాసం పెడతామనండి..

చంద్రబాబునాయుడు గారూ.. గత 18 నెలల కాలంగా రైతు సోదరులు ఆరుసార్లు దెబ్బ మీద దెబ్బ తిన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రావాలంటే రూ. 2000 కోట్లు అవసరం. మీరు వారంరోజుల గడువిచ్చి ఆరూ. 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. లేదంటే అవిశ్వాసం పెడతానని బెదిరించండి. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద ప్రభుత్వం గతేడాది రూ. 3400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది మరో రూ. 3400 కోట్లు కావాలి. మొత్తానికి రూ. 6800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

అవిశ్వాసం పెడతామని.. ఆ 6800 కోట్లూ విడుదలయ్యేలా చేయండి. ప్రతి అక్కా, చెల్లెమ్మ మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలని దివంగత మహానేత పావలా వడ్డీ రుణాలను తెచ్చారు. ఈ పథకానికి గతేడాదివెయ్యి కోట్ల బకాయిలున్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. మొత్తానికి రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. ఇదే చంద్రబాబు.. ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి రూ. 2 వేల కోట్లు కావాలని అడగండి. లేకుంటే మరో వారం రోజుల గడువు తీసుకొని మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చెప్పండి. కానీ మీరలా ఎందుకు చెప్ప లేకపోతున్నారు? కారణం ఏమంటే చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారు.

మీ తప్పును కప్పిపుచ్చుకోడానికి..

శాసన సభలో మీకు 90 మంది శాసనసభ్యుల బలం ఉంది.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో వైపు వేలు చూపిస్తారా? ప్రతి పేదవాడి ఉసురు ఈ చంద్రబాబు నాయుడుకు, ఈ ప్రభుత్వానికి తగిలి ఆ అగ్నిజ్వాలల్లో మాడిపోతారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు, చంద్రబాబు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు.

మిగతా నేతలంతా దొంగ నోటులే
గరుగుబిల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ ఒక పిట్టకథ చెప్పారు. ‘ఒక రైతు వంద రూపాయల నోటు తీసుకొని కూరగాయల కోసమని దుకాణానికి పోయాడు. కావల్సిన కూరగాయలు కొని తన చేతిలో ఉన్న వంద నోటును దుకాణం యజమానికి ఇచ్చారు. ఆ యజమాని నోటును చూసి ఇది దొంగ నోటని, దీన్ని నాకు అంటగడతావా అని రైతును అడిగాడు. మరి మంచినోటు ఎలా ఉంటుందీ అని అమాయక రైతు అడిగితే.. వైఎస్‌ఆర్‌లాగ నికార్సుగా ఉంటుంది, దొంగనోటు మిగిలిన నేతల్లా ఉంటుంది అని చెప్పాడు’ అంటూ కథను ముగిస్తుండగా.. జనం హర్షాతిరేకాలతో అభిమానం చాటుకున్నారు.

వైఎస్‌ఆర్ పాలన సువర్ణ యుగం: జగన్

గుమ్మలక్ష్మిపురం:రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగమని.. రాజశేఖరరెడ్డి సువర్ణపాలనలో రైతులు ఏనాడు కూడా బాధలు పడలేదన్నారు. రైతుల్లో రాజశేఖరుడు ఉన్నాడనే భరోసా వుండేదన్నారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే ధాన్యం అమ్ముకున్నారన్నారు.

విజయనగరం జిల్లాలో ఆరవ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా గుమ్మలక్ష్మిపురంలో ఏర్పాటు చేసిన సభలో జననేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

దివంగత నేత పాలనలో తన కూతురు డాక్టరవుతారనే ఆశ, కొడుకు ఇంజినీరింగ్ అవుతాడన్న కోరిక ప్రతి తండ్రి కళ్లలో కనిపించేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచును లక్షాధికారిని చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేశారన్నారు.

గుమ్మలక్ష్మిపురంలో ఎండలు మండుతున్నప్పటికి యువనేతకోసం ప్రజలు రోడ్లపై ఎదురుచూస్తు నిలుచున్నారు. జననేత చూసేందుకు జనం ఎగబడ్డారు. జగన్ యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ప్రజల నుంచి స్పందన వెలువడింది.