Tuesday, May 24, 2011
జగన్, విజయమ్మల ప్రమాణం నిలుపుదలకు హైకోర్టు నో
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయలక్ష్మిలు ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో పొందుపరచనందున వారిని లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా ప్రమాణం చేయకుండా నిరోధించాలన్న ఓ పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తుల వివరాలు వెల్లడించలేదంటూ విచారణ జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ విషయంలోమధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని కూడా తేల్చి చెప్పింది.
హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పి.సత్యనారాయణ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆస్తుల వివరాలను పరిశీలించేందుకు ఓ స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేటట్లు కూడా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అసలు ఈ వేసవి సెలవుల్లో ఈ వ్యాజ్యాన్ని అంత అత్యవసరంగా దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

రైతు గోడు పట్టని సర్కారొద్దు
విజయనగరం జిల్లా ఓదార్పులో వైఎస్ జగన్ ఉద్ఘాటన
చంద్రబాబూ.. అసమర్థ ప్రభుత్వమంటావేగానీ.. అవిశ్వాసం పెట్టవేం?
నాడు 46 మంది ఎమ్మెల్యేల బలంతోనే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టావు...
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా అవిశ్వాసం పెట్టనంటున్నావు
వైఎస్సార్ చనిపోయిన తరువాత రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే నేతలు కరువయ్యారు
టీడీపీ, కాంగ్రెస్‌ల కంటికి ప్రజల సమస్యలు కనిపించడం లేదు.. ఒక్క జగనే కనిపిస్తున్నాడు
రాష్ట్ర ప్రజల మనోగతాన్ని కడప తీర్పు చాటి చెప్పింది
మాట ఇస్తే మడమ తిప్పని నేతనే జనం కోరుకుంటున్నారు
భోగాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: పేదోడి సంక్షేమం పట్టని, రైతుకు వెన్నుదన్నుగా నిలువని ఈ కాంగ్రెస్ సర్కారు ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రతి రైతు, పేదవాడూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ.. ఇది అసమర్థ ప్రభుత్వం అంటున్నారని, ఆయన మాటల్లో నిజాయితీ ఉంటే ఆ ప్రభుత్వంపై ఆయన ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ప్రశ్నించా రు. విజయనగరం జిల్లాలో మంగళవారం ప్రారంభమైన మలి విడత ఓదార్పు యాత్ర భోగాపురం మండంలోని పలు గ్రామాల్లో సాగింది. రావాడ గ్రామంలో ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చిన జగన్ భోగాపురం మండల కేంద్రంలో జరి గిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ర్టంలో జరుగబోయే రాజకీయ మార్పులకు కడప ఎన్నికలు నాంది పలికాయని అన్నారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
రాష్ట్ర ప్రజల ఆకాంక్షే కడప తీర్పు: ‘‘45 రోజుల కిందట ఓదార్పులో ఉండగా కడప ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో యాత్రను మధ్యలోనే ఆపేసి వెళ్లాను. ఆనాడు మీరు ఎంత ప్రేమ, ఆప్యాయతలతో దీవించి నన్ను యుద్ధానికి పంపారో నేను మరిచిపోలేదు. అదే ప్రేమ, ఆప్యాయతల ను మళ్లీ నా మీద చూపిస్తున్నారు. మీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఎన్నికల వేళ అప్పటికప్పుడు మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకునే నేతలను కడప ప్రజలు ఇంటికి సాగనంపారు. ఏ నాయకుడైతే కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడతాడో.. అతడే తమ నాయకుడని కడప ప్రజలు తీర్పు చెప్పారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల మనోగతాన్ని చాటిచెప్పింది. ప్రజల ఆకాంక్షను బయట పెట్టింది. యావత్ రాష్ట్రం కూడా మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడినే కోరుకుంటోంది. రాష్ర్ట ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కడప ప్రజలు తీర్పు చెప్పారు.
పేదల గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత పేదల గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు. ప్రతిపక్షం, పాలక పక్షం పేదల బాగోగులను పట్టించుకోవడం ఏనాడో మరిచిపోయింది. ఈ చేతగాని ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. చంద్రబాబు కూడా అప్పుడప్పుడు రోడ్డు మీదకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ ఇది అసమర్థ ప్రభుత్వం అని అంటున్నారు. నేను అడుగుతున్నా.. చంద్రబాబు గారూ.. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచుతున్నారు? అసమర్థ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు. నాడు 46 మంది ఎమ్మెల్యేల బలంతోనే.. అవిశ్వాసం పెట్టావు. ఇప్పుడు నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అవిశ్వాసం పెట్టనుగాక పెట్టనంటున్నావు. రైతు సోదరులు ఈ ప్రభుత్వం పోవాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రజలపై కపట ప్రేమతో మొసలి కన్నీళ్లు కార్చడం కాదు.. నీ మాటల్లో నిజాయితీ ఉంటే అవిశ్వాసం పెట్టు. ప్రజా సమస్యలను గాలికి వదిలి చంద్రబాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయి. ఇప్పుడు వారి కళ్లకు పేద ప్రజలు కనిపించడం లేదు. ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.’’
ఏ అవసరమొచ్చినా నేనున్నా..
సన్యాసి కుటుంబానికి జగన్ భరోసా
‘మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నా’నంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పిలి సన్యాసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన సన్యాసి 2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఆయన ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ఆ ఇంట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, సన్యాసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పేర్లను అడిగి, వారిని ఆప్యాయంగా పలకరించారు. సన్యాసి భార్య నారాయణమ్మ, కుమారులు సన్యాసిరావు, ఎర్రయ్య, కుమార్తె నర్సయ్యమ్మ, కోడలు రమణమ్మలను ఓదార్చారు. తల్లి నారాయణమ్మను చక్కగా చూసుకోవాలని వారికి సూచించారు. మీకేకష్టం వచ్చినా ఆదుకోవడానికి నేనున్నానని ధైర్యం చెప్పారు. నారాయణమ్మ జగన్‌కు పరమాన్నం తినిపించారు.

పల్లెలన్నీ మల్లెలై...
* కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం
* జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభం
* వాడవాడలా అపూర్వ ఆదరణ
* కదలివచ్చిన పల్లెలు
* ఇతర పార్టీల నుంచి వలసలు
* భారీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరికలు
పాపం సూర్యుడు... అభిమానులకు పరీక్ష పెట్టబోయాడు. ‘చూద్దాం...వీరి ఓపికెంతో’ అన్నట్టుగా నిన్నామొన్నటికంటే ఎండ తీవ్రత పెంచాడు. కానీ జననేతపై ప్రజలకు గల అభిమానం ముందు ఆయన గారి ట్రిక్కులు పని చేయలేదు. ఎండ మండుతున్నా లెక్క చేయకుండా అభిమానులు, కార్యకర్తలు ఉదయం నుంచీ వేచి చూశారు. తమ అభిమాన నాయకుడు జిల్లాలో ఎప్పుడు అడుగు పెడతారా? అని ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జిల్లాకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. ఆయన పై పూలవాన కురిపించారు.
విజయనగరం, న్యూస్‌లైన్ : విజయుడై వచ్చిన జననేత కోసం పల్లెలన్నీ బారులు తీరాయి. రెండో విడత ఓదార్పు కోసం మంగళవారం జిల్లాకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. రాజపులోవ జంక్షన్ నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. తొలుత మహారాజుపేట గ్రామం వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. అక్కడినుంచి గుడివాడ గ్రామానికి వెళ్లి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆ తర్వాత చెరకుపల్లి గ్రామానికి చేరుకోగానే స్థానికులు డప్పులతో స్వాగతం పలికి, జననేతపై పూలవర్షం కురిపిం చారు. అక్కడి నుంచి లింగాలవలస వెళ్లారు. స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బోను రమణ, రామినాయుడుల ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పోలుపల్లి గ్రామానికి చేరుకోగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఎదురొచ్చి యువనేతను వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కడప ఎంపీ ఆవిష్కరించారు. రావాడ గ్రామంలోని గొల్లలపేటలో వై.ఎస్.ఆర్. మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి గూడెపువలస వస్తుండగా మార్గమధ్యలోని రావివలస గ్రామ ప్రజలు ఎదురొచ్చి, జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. గూడెపువలసలో రాజకీయాలకు అతీతంగా, చిన్న, పెద్ద తేడా లేకుండా జననేతను చూసేందుకు తరలివచ్చారు. దివంగత సీఎం వైఎస్ విగ్రహాన్ని యువనేత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశానికి చెందిన భోగాపురం జెడ్పీటీసీ సభ్యురాలు కొండపు ఆదిలక్ష్మి, సర్పంచ్ దారపు లక్ష్మణరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఇంటి పైడయ్య, మాజీ సర్పంచ్ కొండపు శ్రీనివాసరెడ్డి తదితరులు యువనేత సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరిన జెడ్పీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ కొద్దిసేపు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి అక్కడికి వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం రెడ్డికంచేరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు సుమారు వందమంది, చేపలకంచేరుకు చెందిన 400 మంది వివిధ పార్టీల నుంచి వచ్చి, జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఓదార్పుయాత్ర సైడ్‌లైట్స్
ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెదతాడివాడ గ్రామానికి మంగళవారం వచ్చారు. ఆయన రాకతో గ్రామస్థులు పులకించిపోయారు. ఘన స్వాగతం పలికారు. తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు.
*డెంకాడ మండలం పెదతాడివాడలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినంత సమయం అభిమానులు బాణాసంచా కాల్చారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది.
*పలువురు యువకులు జగన్‌మోహన్‌రెడ్డి తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు.
*జగన్‌మోహన్‌రెడ్డి గ్రామానికి వచ్చే సమయంలో డప్పుల వాయిద్యాలతో సందడి వాతావరణం నెలకొంది.
*జగన్ కాన్వాయ్ వెనుక గ్రామస్థులంతా పరుగులు తీశారు.
*జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించినపుడు అభిమానులు జయజయ నినాదాలు చేశారు.
*జగన్‌మోహన్‌రెడ్డి రాకతో గ్రామమంతా కిక్కిరిసిపోయింది.

కొండల్లో.. మండుటెండల్లో..
6 గంటల్లో 60 కిలోమీటర్ల పర్యటన
విజయనగరం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: చుట్టూ కొండలు.. భానుడు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాడు.. అంత మండుటెండలోనూ జగన్ అలుపెరగకుండా ఓదార్పు యాత్ర సాగించారు. పోలీసులు అభ్యంత రం చెప్తున్నా.. జగన్ ఆరు గంటల్లో సుడిగాలి పర్యటనతో 60 కిలోమీటర్లు ప్రయాణించి ఆత్మ బంధువులను కలుసుకున్నారు. కొండల మధ్య విసిరేసినట్టున్న ప్రతి పల్లెకూ వెళ్లి పల కరించారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు కోసం మంగళవారం రాజపులోవ మీదుగా జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. 45 రోజుల కిందట జగన్ ఇదే జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న తరుణంలోనే కడప ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ప్రజలు, సన్నిహితుల కోరిక మేరకు పార్వతీపురం నియోజక వర్గంలోని వెంకట్రాయుడు పేటకు చెందిన మలిచర్ల సన్యాసిరావు కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. మంగళవారం రావాడ గ్రామంలో ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చడం ద్వారా మలివిడత యాత్ర ప్రారంభించారు. కడప ఎన్నికల్లో దేశంలోనే చరిత్రాత్మక విజయంతో తిరిగి వచ్చిన జగన్‌కు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో ఘనస్వాగతం: మధ్యాహ్నం 12.45 గంటలకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో వేలాది మంది అభిమానులు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. జెడ్పీ చైర్మన్ గొర్లె రామ్మూర్తి నాయుడు, ఎమ్మెల్మే జి.బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పూడి మంగపతి, రవిబాబు, విశాఖ కార్పొరేటర్లు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. జగన్ రాకను పురస్కరించుకుని ఇక్కడి ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు.
అనంతరం ఆయన నేరుగా ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఆయన వెంట అభిమానులు ర్యాలీగా వెళ్లారు. జగన్ భోగాపురం మండలం రాజపులోవ మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడే వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహారాజుపేట, గుడివాడ, చెరుకుపల్లి, లింగాల వలస, పోలిపల్లి, రావాడ, గూడెపువలస, రెడ్డి కంచేరు, డెంకాడ, తాడివాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి రాత్రి పొద్దుపోయే సమయానికి భోగాపురం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరావు అతిథిగృహంలో బస చేశారు.
భారీగా చేరికలు: టీడీపీకి చెందిన భోగాపురం జెడ్పీటీసీ కొండపు ఆదిలక్ష్మి, ఆమె భర్త కొండపు రమణ, ఎంపీటీసీ సభ్యుడు ఇంటి పైడయ్య, గూడెపు వలస సర్పంచ్ లక్ష్మణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కండల శ్రీనివాసరెడ్డితో పాటు పెదకంచేరు గ్రామంలో 100 కుటుంబాలు, చేపల కంచేరు గ్రామం లో 300 కుటుంబాలు, బోయపాలెం గ్రామంలో 50 కుటుంబాలు జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల చేరాయి. యాత్రలో జగన్ వెంట అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యేలు జి. బాబూరావు, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్‌మోహన్‌రావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, శ్రీకాకుళం జెడ్పీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒరుదు కళ్యాణ్, అవనాపు సూరిబాబు, తాడ్డి వెంకట్రావ్, కుంబా రవిబాబు, వాకాడి నాగేశ్వర్‌రావు, కాకర్లపూడి శ్రీనివాసరావు తదితరులున్నారు.

వందలాదిగా... వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి!
బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్: మండలంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ కుటుంబాలు వందలాదిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి. మిర్తివలస గ్రామంలో 200 కుటుంబాలు ఆ పార్టీలో మంగళవారం చేరాయి. ఆ పార్టీ నాయకులు డాక్టర్ బొత్స కాశినాయుడు, పాలవలస మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాశినాయుడు, పాలవలస మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు.
పార్టీలో చేరిన వారిలో పంచాయతీ సభ్యుడు గునపర్తి పకీరు, మత్స్య శాఖ డెరైక్టర్, మండల రజక సంఘం కార్యదర్శి యలమంచిలి రమణ, పంచాయతీ మాజీ సభ్యుడు గండబండు గంగయ్య, కో ఆపరేటివ్ మాజీ డెరైక్టర్ సాలీల లచ్చయ్య, పాలకేంద్రం డెరైక్టర్ గన్ను నారాయణరావు, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మార్సి గంగయ్యతో పాటు గుడుపూరు అప్పలనరసయ్య, సాలీల కృష్ణ, రాములు, ఎల్లయ్య, పోలిరాజు, రాము, జి.సింహాచలం, ఏకల అప్పలస్వామి, ప్రగడ సూర్యనారాయణ, అప్పలనరసయ్య, గణపతి, మానం అప్పారావు, ప్రగడ ఆదినారాయణ, బోగి సాయిరాం ఉన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి...
విజయనగరం: చెరకుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిట్టి భాస్కరరావు, టీడీపీ నాయకులు సరగడ రాము, దుంప అప్పారావు, వాకాడ కొండమ్మ, లింగాలవలస మాజీ ఉప సర్పంచ్ రామినాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామస్థులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెడ్డికంచేరు గ్రామంలో శీరపు గురునాథరెడ్డి, కరయ్య్రరెడ్డి ఆధ్వర్యంలో మైలపల్లి యల్లారావు, సొసైటీ అధ్యక్షుడు కారి జంగాలతోపాటు 400 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాయి. మైలపల్లి అప్పలస్వామి, అమర అప్పన్న ఆధ్వర్యంలో మరో వంద కుటుంబాలు, బోయిలపాలెంలో బోయి గురువులు, నర్సమ్మ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, దిబ్బలపాలెంలో దల్లి అప్పలరాయుడు, నేలాపు లక్ష్మణ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు పార్టీలో చేరాయి.

ఓదార్పు యాత్రపై విస్తృత ప్రచారం
గుమ్మలక్ష్మీపురం రూరల్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో ఈ నెల 29న చేపట్టనున్న ఓదార్పుయాత్ర విజయవంతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నాయకుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ చెప్పారు. ఎల్విన్‌పేటలో ఓదార్పుయాత్రకు సంబంధించి ప్రచారానికి మంగళవారం వచ్చిన ఆయన ఆ పార్టీ స్థానిక కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు ఓదార్పుయాత్రకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. భద్రగిరికి చెందిన పెదపెంకి మురళీరావు అనే అభిమాని పార్టీ కార్యాలయానికి భవనాన్ని సమకూర్చారని చెప్పారు. వైఎస్‌ఆర్ మరణవార్త విని మృతి చెందిన కాకితాడ గ్రామానికి చెందిన ఆరిక భాస్కరరావు, ఉదయపురం గ్రామానికి చెందిన పత్తిక స్వప్న కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి ఓదారుస్తారని, ఆయా గ్రామాలకు వెళ్లి వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నామని చెప్పారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు కుంబురిక దీనమయ్య, పి.వెంకటరావు, నిమ్మల గోపాల్, కొండగొర్రి నాగేశ్వరరావు ఉన్నారు. |
ఆంక్షల సంకెళ్లు తెంచుకొని...
విజయనగరం, న్యూస్‌లైన్: మహానేత కుమారుడు వస్తున్నాడని సంబరపడిన ఆ గ్రామస్థుల కు అధికార పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డు తగిలారు. భోగాపురం మండలానికి వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని గుడివాడ గ్రామానికి ఎలాగైనా తీసుకురావాలని ప్రజలు కోరుకున్నారు. గ్రామంలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను స్థానిక నాయకులు రూపొందించా రు. వారి కోరిక మేరకు రాజాపులోవ, మహారాజుపేట గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని గుడివాడ వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలిసి గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బవుతుండగా అధికార పార్టీ నాయకులకు కన్నుకుట్టింది. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. అయినప్పటికీ మహానేతపై ఉన్న అభిమానం, జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలన్న ఆత్రంతో గ్రామస్థ్థులు ఇవేవీ పట్టించుకోలేదు. ఆంక్షల సంకెళ్లను తెంచుకుని కార్యక్రమానికి వెళ్లారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ విగ్రహం ఉన్న ప్రదేశంలో తమ పార్టీ జెండాలు కట్టి వక్రబుద్ధిని చాటుకున్నారు.
ఆ సమయంలో గ్రామానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డితో గ్రామస్థులు అధికార పార్టీ ఆగడాలను చెప్పి భోరున విలపించారు. దివంగత నేత మీద ప్రేమతో తామంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తామంటే ఆడుగడుగునా అడ్డు తగిలారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని వేడుకున్నారు. ఆ సమయంలో అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వారి వద్దకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. ఇక నుంచి మనమంతా దివంగత నేత ఆశయాల కోసం, జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు కోసం పనిచేద్దామని సర్దిచెప్పి వారిని శాంతపరిచారు

అపూర్వ స్వాగతం
విజయనగరం, న్యూస్‌లైన్ : కడప ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించి, తొలిసారిగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం లభించింది. జిల్లా సరిహద్దులోని రాజపులోవ జంక్షన్ వద్ద రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా ఆయనకు స్వాగతం పలి కారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరితో కలిసి మలి విడత ఓదార్పునకు జిల్లాకు వచ్చిన యువనేత జగన్‌కు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, తాడ్డి వెంకటరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు, కాపారపు శివున్నాయుడు, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు, సుబ్బరాజు, వాసిరెడ్డి తిలక్ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు.
వారితో పాటు రిటైర్డు జిల్లా వైద్యాధికారి డాక్టర్ బొత్స కాశీనాయుడు, గజపతినగరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ది నాయు డు, డాక్టర్ గేదెల తిరుపతిరావు, వ్యాచలపు చినరామునాయుడు, చేనేత సంఘ రాష్ట్ర నాయకుడు వానపల్లి సత్యం నాయుడు, కొత్తవలస మాజీ ఎంపీపీ దమయంతి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు డి.శంకర సీతారామరాజు (సింగ్‌బాబు), గొర్లె వెంకటరమణ, మొయిద ఎంపీటీసీ సభ్యుడు పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్), అవనాపు విజయ్, విక్రమ్, చెన్నా లక్ష్మి, గంట్యా డ మండల కోర్ కమిటీ నాయకులు బి.సత్యనారాయణ, లంక శ్రీను, ఎల్.కె.నాయుడు, విద్యాసంస్థల అధినేత ఎం. ఎస్.ఎన్., కొర్లాం మాజీ సర్పంచ్ సన్యాసినాయుడు, వాకాడ త్రినాథ, శ్రీకాకుళం జిల్లా నేత లు పీఎంజే బాబు, హనుమంతు కిరణ్‌కుమార్, మెంటాడ పద్మశ్రీ, పైడి కృష్ణప్రసాద్, వాసిరెడ్డి వెంకటనాయుడు, పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కూన మంగమ్మ, బొమ్మాళి ఫణికుమార్, విశాఖకు చెందిన వి.శ్రీనివాసరావు, నూకం నాయుడు, వి.నర్సింగమూర్తి, పి. ఝాన్సీ, మేకపాటికి చెందిన షేక్ ఖాజాతేర్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

చిరునవ్వుతో సాగనంపండి
విజయనగరం, న్యూస్‌లైన్: ‘ఉదయం 10 గంటలకు జరగాల్సిన కార్యక్రమం నాలుగు గంటలు ఆలస్యంగా సాగుతున్నా ఎంతో పెద్ద మనుసుతో మీరంతా వేచి ఉన్నారు. ఇంకా ఇలాంటి గ్రామాలెన్నిటికో వెళ్లాల్సి ఉంది. ఈ జగన్‌ను మీ చిరునవ్వుతో...పెద్ద మనసు చేసుకుని సాగనంపాల’ని కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేతజగన్‌మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం 11 గంటల కు ప్రారంభం కావాల్సిన ఓదార్పు యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ముందుగా రాజపులోవ జంక్షన్‌లో వెంకటరమణపేట వద్ద దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అక్కడి నుంచి చెరుకుపల్లికి వెళ్లారు. ఆ గ్రామస్థులు ఆయనకు అఖండ స్వాగతం పలికారు. యువనేత మాట్లాడాలని వారంతా పట్టుబట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘జగన్ ఇలా వచ్చి, అలా వె ళ్లిపోయాడని మరోలా అనుకోవద్దు. మీ కోసం రెండు నిమిషాలు మాట్లాడతా’నని అన్నారు. ‘పెద్ద మనసుతో మీరంతా అర్థం చేసుకుని, చిరునవ్వుతో నన్ను సాగనంపాల’ని కోరారు. లింగాలవలస, పోలిపల్లి, రావాడ గ్రామాల్లోనూ ప్రజలనుద్దేశించి జననేత ఇదే విజ్ఞప్తి చేశారు. దాంతో వారంతా ఎంతో ఆనందించి, జై జగన్ అంటూ చప్పట్ల మధ్య అక్కడి నుంచి ముందుకు వెళ్లనిచ్చారు. |
మాట తప్పితే మన్నించరు:జగన్
విజయనగరం, న్యూస్‌లైన్: మాట మీద నిల బడకుండా మోసగించే నాయకులను ప్రజలు క్షమించరని, వారిని ఇంటికి సాగనంపుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రావాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చుతానని మహానేత కన్నుమూసిన ప్రదేశంలోనే తాను మాటిచ్చానని గుర్తు చేశారు. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే ఇటీవల జరిగిన కడప, పులివెందుల ఎన్నికలు వచ్చేవే కాదని అన్నారు.
రాజకీయ నాయకుడు అంటే మాటమీద నిలబడే నాయకుడు కావాలనే తీర్పు కడప ప్రజల నుంచి వచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాటలను గాలికి వదిలేసే నాయకులను ఎన్నికల సమయంలో ఇంటికి సాగనంపుతామని ఈ తీర్పు ద్వారా ప్రజలు చెప్పారని ఆయన అన్నారు. ఇక్కడ ఏ గుండె చప్పుడు విన్నా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తున్నారని, ఇంత పెద్ద కుటుంబం ఉందన్నసంతృప్తి తనకు చాలని అన్నారు. విద్య, వైద్యం కోసం మహానేత పెట్టిన పథకాల ద్వారాఉన్నత స్థానాలకు చేరుకొని, తమ కుటుంబాలను బాగుపెడదామని భావించే ప్రతి విద్యార్థి చిరునవ్వులో వైఎస్‌ఆర్ కనిపిస్తూనే ఉంటారని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కడప ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ఈ జిల్లాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తొలివిడత ఓదార్పు కంటే అధికంగా ప్రజలు ఆదరాభిమానాలు చూపడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

Subscribe to:
Posts (Atom)