Pages

Tuesday, May 24, 2011

కొండల్లో.. మండుటెండల్లో..

6 గంటల్లో 60 కిలోమీటర్ల పర్యటన
విజయనగరం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: చుట్టూ కొండలు.. భానుడు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాడు.. అంత మండుటెండలోనూ జగన్ అలుపెరగకుండా ఓదార్పు యాత్ర సాగించారు. పోలీసులు అభ్యంత రం చెప్తున్నా.. జగన్ ఆరు గంటల్లో సుడిగాలి పర్యటనతో 60 కిలోమీటర్లు ప్రయాణించి ఆత్మ బంధువులను కలుసుకున్నారు. కొండల మధ్య విసిరేసినట్టున్న ప్రతి పల్లెకూ వెళ్లి పల కరించారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు కోసం మంగళవారం రాజపులోవ మీదుగా జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. 45 రోజుల కిందట జగన్ ఇదే జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న తరుణంలోనే కడప ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ప్రజలు, సన్నిహితుల కోరిక మేరకు పార్వతీపురం నియోజక వర్గంలోని వెంకట్రాయుడు పేటకు చెందిన మలిచర్ల సన్యాసిరావు కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. మంగళవారం రావాడ గ్రామంలో ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చడం ద్వారా మలివిడత యాత్ర ప్రారంభించారు. కడప ఎన్నికల్లో దేశంలోనే చరిత్రాత్మక విజయంతో తిరిగి వచ్చిన జగన్‌కు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.

విమానాశ్రయంలో ఘనస్వాగతం: మధ్యాహ్నం 12.45 గంటలకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో వేలాది మంది అభిమానులు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. జెడ్పీ చైర్మన్ గొర్లె రామ్మూర్తి నాయుడు, ఎమ్మెల్మే జి.బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పూడి మంగపతి, రవిబాబు, విశాఖ కార్పొరేటర్లు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. జగన్ రాకను పురస్కరించుకుని ఇక్కడి ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. 

అనంతరం ఆయన నేరుగా ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఆయన వెంట అభిమానులు ర్యాలీగా వెళ్లారు. జగన్ భోగాపురం మండలం రాజపులోవ మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడే వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహారాజుపేట, గుడివాడ, చెరుకుపల్లి, లింగాల వలస, పోలిపల్లి, రావాడ, గూడెపువలస, రెడ్డి కంచేరు, డెంకాడ, తాడివాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి రాత్రి పొద్దుపోయే సమయానికి భోగాపురం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరావు అతిథిగృహంలో బస చేశారు.

భారీగా చేరికలు: టీడీపీకి చెందిన భోగాపురం జెడ్పీటీసీ కొండపు ఆదిలక్ష్మి, ఆమె భర్త కొండపు రమణ, ఎంపీటీసీ సభ్యుడు ఇంటి పైడయ్య, గూడెపు వలస సర్పంచ్ లక్ష్మణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కండల శ్రీనివాసరెడ్డితో పాటు పెదకంచేరు గ్రామంలో 100 కుటుంబాలు, చేపల కంచేరు గ్రామం లో 300 కుటుంబాలు, బోయపాలెం గ్రామంలో 50 కుటుంబాలు జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల చేరాయి. యాత్రలో జగన్ వెంట అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యేలు జి. బాబూరావు, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్‌మోహన్‌రావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, శ్రీకాకుళం జెడ్పీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒరుదు కళ్యాణ్, అవనాపు సూరిబాబు, తాడ్డి వెంకట్రావ్, కుంబా రవిబాబు, వాకాడి నాగేశ్వర్‌రావు, కాకర్లపూడి శ్రీనివాసరావు తదితరులున్నారు.

No comments:

Post a Comment