విజయనగరం, న్యూస్‌లైన్: ‘ఉదయం 10 గంటలకు జరగాల్సిన కార్యక్రమం నాలుగు గంటలు ఆలస్యంగా సాగుతున్నా ఎంతో పెద్ద మనుసుతో మీరంతా వేచి ఉన్నారు. ఇంకా ఇలాంటి గ్రామాలెన్నిటికో వెళ్లాల్సి ఉంది. ఈ జగన్‌ను మీ చిరునవ్వుతో...పెద్ద మనసు చేసుకుని సాగనంపాల’ని కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేతజగన్‌మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం 11 గంటల కు ప్రారంభం కావాల్సిన ఓదార్పు యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ముందుగా రాజపులోవ జంక్షన్‌లో వెంకటరమణపేట వద్ద దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అక్కడి నుంచి చెరుకుపల్లికి వెళ్లారు. ఆ గ్రామస్థులు ఆయనకు అఖండ స్వాగతం పలికారు. యువనేత మాట్లాడాలని వారంతా పట్టుబట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘జగన్ ఇలా వచ్చి, అలా వె ళ్లిపోయాడని మరోలా అనుకోవద్దు. మీ కోసం రెండు నిమిషాలు మాట్లాడతా’నని అన్నారు. ‘పెద్ద మనసుతో మీరంతా అర్థం చేసుకుని, చిరునవ్వుతో నన్ను సాగనంపాల’ని కోరారు. లింగాలవలస, పోలిపల్లి, రావాడ గ్రామాల్లోనూ ప్రజలనుద్దేశించి జననేత ఇదే విజ్ఞప్తి చేశారు. దాంతో వారంతా ఎంతో ఆనందించి, జై జగన్ అంటూ చప్పట్ల మధ్య అక్కడి నుంచి ముందుకు వెళ్లనిచ్చారు. |
Tuesday, May 24, 2011
చిరునవ్వుతో సాగనంపండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment