Pages

Sunday, May 15, 2011

ఎన్నికలకు రండి.. కాంగ్రెస్, టిడిపిలకు జగన్ సవాల్







to day cartoon in sakshi


లేటెందుకు సార్! పెంచితే 9 నెలల్లో 9 సార్లు పెంచినట్లవుతుంది. ఇలాగే పదో నెల్లో 10 సార్లు 11 నెల్లో 11 సార్లు పెంచుకుంటూ పోతే పద్ధతిగా ఉంటుంది సార్!

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: జూపూడి

కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎంఎల్‌సీ జూపూడిప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి నివాసంలో మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జూపూడి మాట్లాడుతూ వైఎస్ కష్టంతో తీసుకొచ్చిన ప్రభుత్వంలో కిరణ్‌కుమార్ రెడ్డికొనసాగే అర్హతలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సూర్యప్రకాశరావు, కేపీహెచ్‌బీ వైఎస్సార్ పార్టీ నాయకుడు జార్జిహెర్బెట్, సుబ్బలక్ష్మీ, రాంబాబు, మనోహర్, చంద్రశేఖర్, మల్లిఖార్జున్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయంతో అన్నదానాలు

లింగాల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వై.ఎస్.విజయమ్మ, వై.ఎస్.జగన్‌రెడ్డి ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో లింగాల మండలంలో భారీగా డిన్నర్లు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తేర్నాంపల్లె గ్రామంలో గంగాధరరెడ్డి, వెలిదండ్ల గ్రామంలో విశ్వరూప జనార్థన్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు. అంబకపల్లెలో మురళీకృష్ణారెడ్డి, బాబురెడ్డి గ్రామంలో జాకెట్లు పంపిణీ చేశారు.

వృద్ధులకు స్వీట్లు పంపిణీ
పులివెందుల అర్బన్: చిన్నరంగాపురం గ్రామం వద్ద ఉన్న లీలావతి వృద్ధాశ్రమంలో మాజీ ఎంపీపీ ఈసీ గంగిరెడ్డి వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. సేవా అమృత హస్తం అధ్యక్షుడు రాజు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగాపురం సర్పంచ్ ఆదిశేషారెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో..
చక్రాయపేట,న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గండి అంజన్న సన్నిధిలో విజయోత్సవాలను నిర్వహించారు. పాలయ్యగారిపల్లెకు చెందిన రామగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్.వరదారెడ్డి, పీ.శివారెడ్డి, సుఖవరదారెడ్డి,సిద్దారెడ్డి, కదిరి నరసింహారెడ్డి, ఎల్‌జీ వరదారెడ్డి 1008 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే చక్రాయపేట మండలం కె ఎర్రగుడి గ్రామ సర్పంచ్ సూర్యకాంతమ్మ ఆమె భర్త రఘునాథరెడ్డి, సిద్దారెడ్డి, సరోజమ్మ, శ్రీరాములురెడ్డి, చెన్నక్రిష్ణమనాయుడు, సూర్యభాస్కర్‌నాయుడు, గఫూర్, సుధాకర్‌రెడ్డి, భా స్కర్‌నాయక్, నాయుడు, నాయక్, ఎం. రామచంద్రారెడ్డి, సరోజమ్మ, శ్రీనివాసులురెడ్డి, తిరుమలరెడ్డి, పెద్ద ఉత్తయ్య, రమణయ్య కలసి 303 కొబ్బరికాయలు కొట్టారు. మాజీ జడ్పీటీసీ స భ్యుడు జయచంద్ర తలనీలాలు సమర్పించారు.

మైనార్టీల అభిమానం
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్, వై.ఎస్.విజయమ్మలు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పట్టణంలో మైనార్టీ నాయకుడు ఎస్‌ఎం నూరుల్లా ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ నయూమ్, బషీర్, పండు, రోషిత్, అమీర్, కాదర్‌బాషా, కలంధర్, ఒసామా, ఖాదురు, అహ్మద్, జాకీర్, నూరు, ఖాదర్‌బాషా (అప్పు) పాల్గొన్నారు.

స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
కడప అగ్రికల్చర్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే యువనేత జగన్‌తోనే సాధ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రే కం సుబ్బరాయుడు తెలిపారు. శనివారం నగరంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 501 టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేకం శివయ్య, ఆంజనేయులు, రాజా, గంగిరెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్, సుబ్బారెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

బిజీబిజీగా ఎంపీ జగన్

పులివెందుల అర్బన్ /టౌన్, న్యూస్‌లైన్ : ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అభిమానులను ఆప్యాయంగా పలుకరించారు. పులివెందుల, తొండూరులో పెళ్లిళ్లకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.

కిటకిటలాడిన జగన్ నివాసం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పులి వెందుల నియోజకర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తండోప తండాలుగా తరలి వచ్చారు. జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. చాలామంది వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారందరినీ ఆయన పేరుపేరునా పలుకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కూడా పలు విషయాలపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో వేముల మాజీ ఎంపీపీ జనార్థన్‌రెడ్డి, సింహాద్రిపురం మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డి, చక్రాయపేట ప్రవీణ్, గురిజాల భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్‌ను కలిసిన నాయకులు
పులివెందులలోని వైఎస్ ప్రకాష్‌రెడ్డి స్వగృహంలో శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు పట్టణ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధు, డాక్టర్ ఇసి గంగిరెడ్డి పలు విషయాలపై చర్చించుకున్నారు. వీరితోపాటు అంబకపల్లె మురళి, తేలూరు శివరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ర మణారెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, మాజీ కౌన్సిలర్ నాగభూషణం, మనోహర్, చిన్నప్ప తదితరులు ఉన్నారు.

తిరుపతి లడ్డూ తినిపించిన చెవిరెడ్డి
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాన్ని జగన్‌కు తినిపించారు.

వధూవరులకు జగన్ ఆశీర్వాదం
పట్టణంలోని పాల్‌రెడ్డి పంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన స్థానిక ఎర్రగుడిపాలెంకు చెందిన కోళ్ల భాస్కర్ అన్న చిన్నన్న కుమార్తె శివమల్లేశ్వరి, శివప్రసాద్‌ల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారి బంధుమిత్రులను ఆప్యాయంగా పలుకరించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహ ర్‌రెడ్డి, ఇసి గంగిరెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సూరి, భాస్కర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తొండూరులో..
స్థానిక టీటీడీ కల్యాణ మంటపంలో తొండూరు ఎంపీటీసీ కుమారుడు పాములేటి, నాగమణిల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కల్యాణ మంటపం నుంచి వెలుపలికి రాగానే పెళ్లికి వచ్చినవారు ఆయన కరచాలనం కోసం పోటీపడ్డారు. జగన్‌ను భూజాలపైకి ఎత్తుకుని ‘వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు కార్యకర్తలను ఆయన పేరుపేరునా పిలువడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

షరాబు సంఘం అధ్యక్షుని తండ్రికి నివాళి
పులివెందుల షరాబు సంఘం అధ్యక్షుడు రామమోహన్ తండ్రి కుళ్లాయప్ప(75) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వారింటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు పులివెందుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, షరాబు సంఘం స్వర్ణ కారుల సంఘం నాయకులు ఉన్నారు

అన్నదాతకు అండగా జగన్


గుంటూరు సెంట్రల్, న్యూస్‌లైన్: రాష్ట్ర భావినేత వైఎస్ జగన్ మాత్రమేనని పశ్చిమగోదావరి జిల్లా గణపవరం జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు నవుడు వెంకటరమణ తెలిపారు. గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టనున్న రైతు దీక్షకు తరలివచ్చిన ఆయనదీక్షా ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ఏ మాత్రం గర్వపడకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలోనే ఇలాంటి వ్యక్తి జగన్ ఒక్కరేనన్నారు. యువనేతను సీఎంగా చూసేందుకు రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వాలు అన్నదాతను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ దీక్ష చేపట్టారని చెప్పారు. దీక్షకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. మండుటెండలను లెక్క చేయకుండా రైతు సమస్యల పరిష్కారం కోసం జగన్ పోరాడటం అభినందనీయమన్నారు.

రైతుదీక్షకు న్యాయవాదుల మద్దతు


గుంటూరు లీగల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్‌మోహనరెడ్డి గుంటూరులో 48 గంటలపాటు చేపట్టనున్న రైతుదీక్ష కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా లీగల్ సెల్ సంపూర్ణ మద్దతు తెలిపింది. లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అరండల్‌పేట 11/2లోని లీగల్‌సెల్ కార్యాలయం నుంచి దీక్ష శిబిరం వరకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా నల్లకోటు ధరించి ప్రదర్శనలో పాల్గొననున్నారు.

సచిన్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు

31న సత్కారం
వరల్డ్‌కప్ టీమ్‌నూ సన్మానించనున్న బీసీసీఐ

ముంబై : అవార్డులు, రివార్డులు అతని సొంతం. రికార్డులకు అతనంటే ఎంతో ఇష్టం. ఎన్నో, ఎన్నెన్నో రికార్డుల ను, అవార్డులను సొంతం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచి న్ టెండూల్కర్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. 2009-10 సీజన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సచిన్‌ను పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ అవార్డుతో సత్కరించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈనెల 31న జరిగే బిసీసీఐ నాల్గవ వార్షిక అవార్డు ప్రదాన కార్యక్రమంలో సచిన్‌కు ఈ సత్కారం జరగనుంది. మరో ఆసక్తికర అంశమేంటంటే .. 28 ఏళ్ల తర్వాత వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచిన ధోనీ సేనను కూడా ఈ సందర్భంగా సత్కరించనున్నారు. దీంతో పాటు సీ.కే. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు 15 లక్షల రూపాయల నగదుతో మరో ఆటగాడిని సత్కరించనున్నారు. అతనెవరనేది 27న ప్రకటిస్తామని బిసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. వయసు తేడా ప్రాతిపదికగా.. 2009-10 సీజన్‌లో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు.

about party photos




వైయస్ జగన్ రైతు దీక్షలో పాల్గొన్న ఆరుగురు ఎమ్మెల్యేలు

గుంటూరు: రైతులకు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన దీక్షలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీల నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు, పుల్లా పద్మావతి, తిప్పారెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణ, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ పీఆర్పీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ, భూమా నాగిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా అంతకుముందు భారీగా అభిమానులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చిన వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేశారు. కాగా అంతకుముందు రైతు నాయకుడు తికాయత్ మృతికి దీక్షలో నివాళులు అర్పించారు. రైతు సంక్షేమం కోసం తికాయత్ జరిపిన ఉద్యమాల గురించి మాట్లాడారు. మూడు నెలల క్రితం చెరకు పంటకు మద్దతు ధర కోరుతూ మూడు లక్షల మంది రైతులతో ఢిల్లీని ముట్టడించిన తికాయత్, తన జీవితంలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

YSR Rythu Deeksha in Guntur-from sakshi tv