Pages

Sunday, May 15, 2011

బిజీబిజీగా ఎంపీ జగన్

పులివెందుల అర్బన్ /టౌన్, న్యూస్‌లైన్ : ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అభిమానులను ఆప్యాయంగా పలుకరించారు. పులివెందుల, తొండూరులో పెళ్లిళ్లకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.

కిటకిటలాడిన జగన్ నివాసం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పులి వెందుల నియోజకర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తండోప తండాలుగా తరలి వచ్చారు. జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. చాలామంది వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారందరినీ ఆయన పేరుపేరునా పలుకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కూడా పలు విషయాలపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో వేముల మాజీ ఎంపీపీ జనార్థన్‌రెడ్డి, సింహాద్రిపురం మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డి, చక్రాయపేట ప్రవీణ్, గురిజాల భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్‌ను కలిసిన నాయకులు
పులివెందులలోని వైఎస్ ప్రకాష్‌రెడ్డి స్వగృహంలో శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు పట్టణ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధు, డాక్టర్ ఇసి గంగిరెడ్డి పలు విషయాలపై చర్చించుకున్నారు. వీరితోపాటు అంబకపల్లె మురళి, తేలూరు శివరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ర మణారెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, మాజీ కౌన్సిలర్ నాగభూషణం, మనోహర్, చిన్నప్ప తదితరులు ఉన్నారు.

తిరుపతి లడ్డూ తినిపించిన చెవిరెడ్డి
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాన్ని జగన్‌కు తినిపించారు.

వధూవరులకు జగన్ ఆశీర్వాదం
పట్టణంలోని పాల్‌రెడ్డి పంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన స్థానిక ఎర్రగుడిపాలెంకు చెందిన కోళ్ల భాస్కర్ అన్న చిన్నన్న కుమార్తె శివమల్లేశ్వరి, శివప్రసాద్‌ల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారి బంధుమిత్రులను ఆప్యాయంగా పలుకరించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహ ర్‌రెడ్డి, ఇసి గంగిరెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సూరి, భాస్కర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తొండూరులో..
స్థానిక టీటీడీ కల్యాణ మంటపంలో తొండూరు ఎంపీటీసీ కుమారుడు పాములేటి, నాగమణిల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కల్యాణ మంటపం నుంచి వెలుపలికి రాగానే పెళ్లికి వచ్చినవారు ఆయన కరచాలనం కోసం పోటీపడ్డారు. జగన్‌ను భూజాలపైకి ఎత్తుకుని ‘వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు కార్యకర్తలను ఆయన పేరుపేరునా పిలువడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

షరాబు సంఘం అధ్యక్షుని తండ్రికి నివాళి
పులివెందుల షరాబు సంఘం అధ్యక్షుడు రామమోహన్ తండ్రి కుళ్లాయప్ప(75) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వారింటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు పులివెందుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, షరాబు సంఘం స్వర్ణ కారుల సంఘం నాయకులు ఉన్నారు

No comments:

Post a Comment