31న సత్కారం
వరల్డ్‌కప్ టీమ్‌నూ సన్మానించనున్న బీసీసీఐ
ముంబై : అవార్డులు, రివార్డులు అతని సొంతం. రికార్డులకు అతనంటే ఎంతో ఇష్టం. ఎన్నో, ఎన్నెన్నో రికార్డుల ను, అవార్డులను సొంతం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచి న్ టెండూల్కర్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. 2009-10 సీజన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సచిన్‌ను పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ అవార్డుతో సత్కరించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈనెల 31న జరిగే బిసీసీఐ నాల్గవ వార్షిక అవార్డు ప్రదాన కార్యక్రమంలో సచిన్‌కు ఈ సత్కారం జరగనుంది. మరో ఆసక్తికర అంశమేంటంటే .. 28 ఏళ్ల తర్వాత వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచిన ధోనీ సేనను కూడా ఈ సందర్భంగా సత్కరించనున్నారు. దీంతో పాటు సీ.కే. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు 15 లక్షల రూపాయల నగదుతో మరో ఆటగాడిని సత్కరించనున్నారు. అతనెవరనేది 27న ప్రకటిస్తామని బిసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. వయసు తేడా ప్రాతిపదికగా.. 2009-10 సీజన్‌లో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment