గుంటూరు: రైతులకు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన దీక్షలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీల నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు, పుల్లా పద్మావతి, తిప్పారెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణ, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ పీఆర్పీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ, భూమా నాగిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా అంతకుముందు భారీగా అభిమానులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చిన వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేశారు. కాగా అంతకుముందు రైతు నాయకుడు తికాయత్ మృతికి దీక్షలో నివాళులు అర్పించారు. రైతు సంక్షేమం కోసం తికాయత్ జరిపిన ఉద్యమాల గురించి మాట్లాడారు. మూడు నెలల క్రితం చెరకు పంటకు మద్దతు ధర కోరుతూ మూడు లక్షల మంది రైతులతో ఢిల్లీని ముట్టడించిన తికాయత్, తన జీవితంలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment