Pages

Tuesday, May 24, 2011

ఆంక్షల సంకెళ్లు తెంచుకొని...

విజయనగరం, న్యూస్‌లైన్: మహానేత కుమారుడు వస్తున్నాడని సంబరపడిన ఆ గ్రామస్థుల కు అధికార పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డు తగిలారు. భోగాపురం మండలానికి వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని గుడివాడ గ్రామానికి ఎలాగైనా తీసుకురావాలని ప్రజలు కోరుకున్నారు. గ్రామంలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను స్థానిక నాయకులు రూపొందించా రు. వారి కోరిక మేరకు రాజాపులోవ, మహారాజుపేట గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని గుడివాడ వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. 

ఈ విషయం తెలిసి గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బవుతుండగా అధికార పార్టీ నాయకులకు కన్నుకుట్టింది. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. అయినప్పటికీ మహానేతపై ఉన్న అభిమానం, జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలన్న ఆత్రంతో గ్రామస్థ్థులు ఇవేవీ పట్టించుకోలేదు. ఆంక్షల సంకెళ్లను తెంచుకుని కార్యక్రమానికి వెళ్లారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ విగ్రహం ఉన్న ప్రదేశంలో తమ పార్టీ జెండాలు కట్టి వక్రబుద్ధిని చాటుకున్నారు. 

ఆ సమయంలో గ్రామానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డితో గ్రామస్థులు అధికార పార్టీ ఆగడాలను చెప్పి భోరున విలపించారు. దివంగత నేత మీద ప్రేమతో తామంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తామంటే ఆడుగడుగునా అడ్డు తగిలారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని వేడుకున్నారు. ఆ సమయంలో అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వారి వద్దకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. ఇక నుంచి మనమంతా దివంగత నేత ఆశయాల కోసం, జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు కోసం పనిచేద్దామని సర్దిచెప్పి వారిని శాంతపరిచారు

No comments:

Post a Comment