ఓదార్పు యాత్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఓవైపు మండుతున్న ఎండలు.. ఇంకోవైపు జన తాకిడితో గంటల తరబడి ఆలస్యమవుతున్న ఓదార్పు యాత్ర.. అయినా అలసట ఎరుగకుండా జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మబంధువు మన పల్లెకు వస్తున్నారనే కబురు తెలియడమే ఆలస్యం.. మహిళలు ఇంటికి తాళం వేసి, పసి పిల్లలను సైతం చంకన వేసుకొని మండుటెండలో చెమటలు గక్కుతూ నడిరోడ్డుపైనే నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే హారతిపట్టి ఆశీర్వదిస్తున్నారు. అవ్వలు.. తాతలైతే ఒంట్లో సత్తువనంతా కూడ తీసుకొని జనంలో ముందు వరసలో నిలబడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఐదో రోజు శనివారం ఓదార్పు యాత్ర బొబ్బిలి మండలం పిరిడి గ్రామం నుంచి మొదలైంది. అక్కడి నుంచి శివడవలస, పెదపెంకి మీదుగా బలిజపేట మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తర్వాత యాత్ర మిర్తివలస, చింతాడ, కలవరాయి, జానుమల్లు వలస మీదుగా సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. గాదెల వలస కోటసీతారామపురం, రంగంపల్లి, పణుకుపేట, చినభోగిల మీదుగా సీతానగరం మండల కేం ద్రం చేరింది. ఇక్కడ భారీ ఎత్తున హాజరైన ప్రజ లను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అక్కడి నుంచి బూర్జ, పెద అంకాలాం, బీవీపురం, గరుగుబిల్లి చిలకాం చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు యాత్ర పూర్తయిన తర్వాత చిలకాంలో ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంట్లో జగన్‌మోహన్‌రెడ్డి బస చేశారు. శనివారం మొత్తం 12 వైఎస్సార్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి
జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణించే దారిలో ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వచ్చాయి. దయానిధిపాలెం ఓదార్పు యాత్ర సాగిపోతున్న దారికి అర కిలో మీటర్ దూరంలో ఉంది. గ్రామస్తులంతా పిల్లా పాపలతో కలిసి రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికి సమయం సరిగ్గా మధ్యాహ్నం రెండు అవుతోంది. వారు ఉదయం 11 గంటలకే రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డారట. అంత ఎండలోనూ వైఎస్సార్ తనయుడిని చూసిన తరువాతే వెళ్లారు. గాదెలవలస గ్రామం యాత్ర షెడ్యూల్‌లో లేదు. లేకపోయినప్పటికీఊరు ఊరంతా ఏకమై వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. దాదాపు మూడు వేల మంది జనం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇక్కడ విగ్రహం ఉందని కనీసం యాత్ర నిర్వాహకులకు కూడా తెలియదు. గ్రామస్తుల పట్టుదలకు ఎంపీ ముగ్దుడయ్యారు. ఈ పల్లెలు మాత్రమే కావు, రంగంపేట, పణుకు పేట, కాశాపేట, పూనుబుచ్చింపేట.. ఇలా ప్రతి గ్రామం రోడ్డు మీదకు వచ్చి ఆత్మబంధువుకు ఆహ్వానం పలికింది.
శనివారం జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెలే జీ బాబురావు, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మో హన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు సర్రాజు, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు నిర్మలా కుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడి నాగేశ్వర్ రావు తదితరులున్నారు.
No comments:
Post a Comment