Friday, June 24, 2011
Friday, June 17, 2011
విద్యార్థులకు జగన్ హామీ
ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా) : స్వరాజ్ నగర్‌లోని తమ హాస్టల్‌ని ఊరి చివరకు తరలిస్తున్నారని విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని జగన్ వారికి హామీ ఇచ్చారు.
Tuesday, June 14, 2011
అన్నదాత కన్నీటికి జవాబు ఏది?
{పతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి
‘మద్దతు’ లేక 40 లక్షల టన్నుల రబీ ధాన్యం ఇంకా పొలాల్లోనే ఉంది
రైతు నానా కష్టాలు పడుతున్నాడు
ఇలాగైతే అతడెలా బతకాలి? ఖరీఫ్‌కు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి?
సర్కారును నిలదీయాల్సిన తెలుగుదేశం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడింది
ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ పదవికి పోటీ పెట్టి రాజకీయం చేసింది
అసెంబ్లీలో స్పీకర్ పోటీపైనే మాట్లాడిందిగానీ.. రైతుల సమస్యల ప్రస్తావన లేదు
చిత్తూరు, న్యూస్‌లైన్: సాగు కోసం రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చిత్తూరు ‘సాగు పోరు’లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుంటే.. కనీస మద్దతు ధర అనే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే.. అన్నదాత ఎలా బతకగలడని ప్రశ్నించారు.
రైతన్నల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సాగు పోరు’ పేరుతో సోమవారం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించగా.. రైతన్నలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించని తెలంగాణ జిల్లాల్లో సైతం ధర్నాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ‘సాగు పోరు’ ధర్నాలో పాల్గొన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రైతన్నల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వానికి చూపడానికే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టంచేశారు. చెరుకు, మామిడి, పత్తి, వరి, మల్బరీ.. ఇలా అన్ని పంటల రైతులూ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నారంటూ వారి కష్టాలను ఆయన వివరించారు. రైతు మోములో చిరునవ్వు చెరిపేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగుచేయడంకన్నా.. ఉరే మేలన్న భావనలో రైతులు ఉన్నారన్నారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
చెరుకు, మామిడి రైతుకు దిక్కేది?
చైతన్య యాత్రల పేరుతో రైతులకు కౌన్సెలింగ్ చేయాలంటున్న రాష్ట్ర ప్రభుత్వానికే కౌన్సెలింగ్ అవసరం. వారి కళ్లకు రైతుల కష్టాలు కనబడ్డం లేదు. రైతుల అవస్థలను ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకే వారి సొంత జిల్లా అయిన చిత్తూరులో ధర్నాలో నేను పాల్గొంటున్నాను. వారిద్దరినీ నేను ప్రశ్నిస్తున్నా... రాష్ట్రం దాకా ఎందుకు ఈ జిల్లాలో చెరుకు రైతులు పడుతున్న కష్టాలు మీకు కనబడ్డం లేదా? చెరుకు రైతుకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన బకాయిలు కేవలం ఈ జిల్లాలోనే రూ. 16 కోట్లు ఉంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా? చెరకు క్రషింగ్ ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలైతే.. ఇప్పటికీ కనీస మద్దతు ధర ఎంతో చెప్పలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మామిడి రైతు సంగతి చూస్తే.. క్వింటాలు 20 వేలు పలుకుతున్న రోజులు చూశాం. కానీ ఇప్పుడు క్వింటాలురూ. 4 వేలు కూడా రాని పరిస్థితిలో రైతు అష్టకష్టాలు పడుతున్నాడు.
బీటీ కంపెనీలతో సర్కారు లాలూచీ
బీటీ పత్తి విత్తనాలను తీసుకుంటే.. రాష్ట్రంలో 98 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, 47 లక్షల ప్యాకెట్ల బీటీ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్యాకెట్ రేటు రూ. 1,800 ఉంటే.. సంబంధిత కంపెనీలతో కొట్లాడి ఆ ధరను రూ. 750కు తగ్గించేలా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీలతో లాలూచీ పడిపోయింది. అదే ప్యాకెట్‌ను రూ. 750కు మరో రూ. 180 అదనంగా చేర్చి కంపెనీలు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మల్బరీ సాగు గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వేళ కేజీ పట్టు గూళ్లు రూ. 300, రూ. 400 ఉంటే.. ఈ రోజు అవి రూ. 175కే పడిపోయినా.. వారి కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడ్డం లేదు. వేరు శెనగ రైతు దుస్థితి వేరే చెప్పనక్కర్లేదు.
ఇలాగైతే రెతైలా బతకాలి?
విత్తనాల దగ్గర్నుంచి ఎరువుల దాకా.. ఎరువుల దగ్గర్నుంచి డీజిల్ దాకా రైతు పండిస్తున్న పంట మీద ప్రతి ఏడాదీ పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 60 శాతం పెట్టుబడి పెరిగింది.. మరోవైపు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలన్న బాధ్యతనే మరిచి ప్రవర్తిస్తోంది. తాను పండించిన పంటకు కనీస మద్దతు ధరే రాకపోతే.. ఆ రైతు ఎలా బతకగలడని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.
ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలి?
మొన్న రబీలో పండించిన ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో.. రైతు దాన్ని తక్కువ రేటుకు అమ్ముకోలేక, అమ్ముకుందామన్నా గోదాముల్లో స్థలం లేక, కొనే దిక్కు లేకపోవడంతో.. ఇలా దాదాపుగా 40 లక్షల టన్నుల దాకా ధాన్యం పొలాల్లోనే మిగిలిపోయింది. రబీలో పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. ఈ రైతు సోదరుడు ఖరీఫ్‌లో పంటకు ఎక్కడి నుంచి పెట్టుబడి తెస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడి ముఖాన, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు చూడాలన్న ఆలోచనను పక్కన పెట్టింది. ఇలా పక్కనబెట్టిన ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని నేను ప్రశ్నిస్తున్నా?
అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు?
కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని రైతు సమస్యలను గాలికొదిలేశాయి. రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనపై ఆనాడు చంద్రబాబు అసెంబ్లీలో 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం ప్రతిపాదించారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు 90 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా అసెంబ్లీలో అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదు? నలభయ్యేళ్ల చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా స్పీకర్ పదవికి పోటీ పెట్టని సంప్రదాయం మన రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఇటీవల స్పీకర్ పదవికి టీడీపీ పోటీ పెట్టి రాజకీయం చేసింది. రాజకీయం చేసి అసెంబ్లీలో ఆ స్పీకర్ ఎన్నికపైనే మాట్లాడిందికానీ.. రైతు సమస్యలపై ఒక్క మాటా మాట్లాడలేదు. మీ రాజకీయాలను దేవుడు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో మీ రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా దక్కవు. కుమ్మక్కయిన ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పేదవాని కన్నీటి బొట్లే సమాధానం చెబుతాయి. కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరులో తాము పడుతున్న కష్టాలను చెప్పుకోడానికి ఇంత మంది రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారంటే.. వారిద్దరికీ ఇప్పటికైనా సిగ్గు రావాలని, బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రైతులను ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.

16 నుంచి జగన్ వైఎస్ఆర్జిల్లా పర్యటన
కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తారు. 16న తొండూరు, 18న సింహాద్రిపురం మండలాల్లో పర్యటిస్తారు. 17న ప్రొద్దుటూరు, 19న మైదుకూరు నియోజకవర్గాలలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
Monday, June 13, 2011
రైతుల పరిస్థితి దుర్భరం: జగన్
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారైనప్పటికీ ఇక్కడ రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతుపోరు కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రబీలో పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు. గూడౌన్లలో నిల్వ చేసుకునే అవకాశంలేదని, కొనేవాడు కూడా లేడని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు తాము పండించిన పంటని పోలాల్లోనే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల కన్నీటికి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి రైతు సోదరుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఇక్కడి రైతులు పడుతున్న బాధలను వివరిస్తూ కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తానని చెప్పారు.
విత్తన వ్యాపారులతో ప్రభుత్వం లాలూచీపడిందని జగన్ ఆరోపించారు. తగినన్ని విత్తనాలు సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.90 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా, 40 లక్షలు మాత్రమే సరఫరా చేశారని చెప్పారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణయుగం నడుస్తున్నవేళ ప్రతిపక్ష నేత అయిన ఈ చంద్రబాబు నాయుడు గద్దె దింపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇవాళ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికల్లో పోటీ పెట్టే సాంప్రదాయంలేకపోయినా ఆ ఎన్నికని రాజకీయం చేశారని విమర్శించారు. ఆ రెండు రోజులు స్పీకర్ ఎన్నిక గురించిమాత్రమే మాట్లాడారని, ఒక్క రోజు కూడా రైతుల బాధల గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు

Monday, June 6, 2011
Wednesday, June 1, 2011
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
‘స్థానిక’ ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
ఈ నెల 15లోగా మండల, అసెంబ్లీ,
జిల్లా అడ్‌హాక్ కమిటీల నియామకం
15 నుంచి సభ్యత్వ నమోదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు వ్యతిరేక సర్కారుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అన్నదాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబడుతూ.. ఈ సర్కారును కదిలించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టక తప్పదని చెప్పారు. బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన అధ్యక్షతన పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల సమావేశం జరిగింది. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఈ సమావేశం తీర్మానం చేసింది.
ముందుగా దివంగత నేత వైఎస్‌కు భేటీ నివాళులు అర్పించింది. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేసిన జగన్.. రాష్ట్రంలో రైతుల అధ్వాన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహానేత వైఎస్సార్ మరణించాక వరుసగా రెండు, మూడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. తాను ఇస్తానన్న సబ్సిడీలో పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేకపోయింది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంవల్ల మళ్లీ తాజా రుణాలు కూడా లభించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక రైతులు తాము వరి ధాన్యం పండించబోమని స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం విచారకరం.
ఇది ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేక పోయిందన్నారు. సుమారు 70 శాతం మంది ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. భేటీ అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులకు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఈ నెల 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఏదో ఒక జిల్లాలో ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.
అడ్‌హాక్ కమిటీల్లో అందరికీ స్థానం..
మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా అడ్‌హాక్ కమిటీలను ఈ నెల 15 లోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు అంబటి చెప్పారు. ‘ఆయా జిల్లాల అడ్‌హాక్ కన్వీనర్లు, ముఖ్య నేతలు, ఎన్నికల పరిశీలకులు సమష్టిగా చర్చించుకుని అడ్‌హాక్ కమిటీలోని సభ్యుల పేర్లను ఖరారు చేయాలని సూచించాం. అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా అన్ని సామాజిక వర్గాల వారినీ ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఇందులో స్థానం ఉంటుంది. ఈ కమిటీలను పార్టీ కేంద్ర పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) ఆమోదం మేరకు ప్రకటించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. కమిటీల నియామకం తర్వాత 15వ తేదీ నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇపుడున్న పార్టీల మాదిరిగా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను చేర్పించే విషయంలో వినూత్న పద్ధతిని అనుసరిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరతారు. రుసుం తీసుకుని, వారితో సంతకాలు చేయిస్తారు’ అని అంబటి వివరించారు.
ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి..
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలెప్పుడు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చినట్లు అంబటి తెలిపారు. అడ్‌హాక్ కన్వీనర్లు, ఎన్నికల పరిశీలకులు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని, ఇప్పటి నుంచే వారిని ఆ దిశగా నడిపించాలని కోరామని చెప్పారు. వివిధ అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది జూలై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశంలోనే వెల్లడిస్తామని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అన్నదాతను ఆదుకోండి
ముఖ్యమంత్రికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం
|
నమ్మకంతో బాధ్యతలు అప్పగించా: జగన్
హైదరాబాద్ : ‘‘మీ అందరి మీద ఎంతో నమ్మకంతో మీకు బాధ్యతలు అప్పగించాను. కష్టపడి పని చేయండి.మీరు పార్టీ తరపున చేయల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పార్టీ బాధ్యతలు నిర్వర్తించలేమని భావిస్తే ఇపుడే చెప్పండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందాం. అంతే గానీ బాధ్యతలు స్వీకరించి పార్టీ పని చేయకుండా ఉండొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు విస్పష్టంగా తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకులు, కేంద్ర పాలక మండలి సభ్యులను ఉద్దేశించి రెండో రోజు ప్రసంగిస్తూ ఎవరైనా పార్టీ చెప్పిన పనులు నిర్వహించలేమని భావిస్తే చేతులెత్తాలని కోరారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ఇపుడు చేస్తామని చెప్పి మధ్యలో మానుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, కనుక ముందే చెప్పాలని ఆయన కోరారు. పార్టీ నేతలను ప్రోత్సాహ పరుస్తూనే సభ్యత్వం, కమిటీల ఏర్పాటు వంటి విషయాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సున్నితంగా అన్నారు. అడ్‌హాక్ కన్వీనర్లకు పార్టీ వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉంటుందనీ అయితే అందరికీ ఆమోదయోగ్యంగా పనులు చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందనీ జగన్ అన్నారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా అడ్‌హాక్ కమిటీల్లో ఉండాల్సిన సభ్యుల కనీస సంఖ్య 6 లేదా 7 మంది ఉండాలనీ, గరిష్ట సంఖ్య 10 మంది ఉండాలనీ ఆయన సూచించారు. ఈ కమిటీల్లో సాధ్యమైనంత వరకూ అన్ని వర్గాలూ ఉండేలా చూడాలని కూడా ఆయన కోరారు. సభ్యత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల మాదిరిగా బోగస్‌వి ఉండరాదని ఆయన హెచ్చరించారు. కచ్చితంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం చే ర్పించాలనీ సభ్యత్వ రుసుము వారి వద్ద నుంచే వసూలు చేసి వారి సంతకాలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలా కాకుండా నాయకులు మొత్తం డబ్బులు తామే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చెల్లిస్తామంటే అంగీకరించబోమనీ ఆయన అన్నారు. సభ్యత్వ రుసుము వారి వద్ద తీసుకున్నపుడే పార్టీలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయనీ, వాటిని పార్టీ పటిష్టత కోసం మలుచుకోవాలని ఆయన పార్టీ నేతలతో అన్నారు.
తెలంగాణపై విస్పష్టమైన విధానం
తెలంగాణ విషయంలో పార్టీకి స్పష్టమైన వైఖరి ఉండాలని ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లా కన్వీనర్లు పి.జనక్ ప్రసాద్, కె.కె.మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి అధ్యక్షుడు జగన్‌కు సూచించారు. జనక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారనీ వారందరూ మన పట్ల సానుకూలంగా ఉన్నారనీ అన్నారు. వారి విశ్వాసం మరింతగా చూరగొనాలంటే తెలంగాణపై ఒక విధానం ప్రకటించడంతో పాటుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. అందుకు జగన్ స్పందిస్తూ కచ్చితంగా ఇడుపులపాయలో జరిగే ప్లీనరీలో వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు.

Subscribe to:
Posts (Atom)