Pages

Sunday, May 22, 2011

జగన్‌కు ‘అనంత’ నీరాజనం

ఎంపీ ‘అనంత’ కుమార్తె వివాహానికి హాజరు
వైఎస్‌ఆర్ మెమోరియల్ ఆస్పత్రి ప్రారంభం
సీఎం, మంత్రులకు నిరసన సెగ 



అనంతపురం, న్యూస్‌లైన్: కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మొదటిసారి అనంతపురం వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం ఘనస్వాగతం పలికారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్.. కాబోయే సీఎం జగనన్నకు జై..’ అంటూ నినదించారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఆయనను చూసేందుకు అభివూనులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇదే కార్యక్రమానికి హాజరైన సీఎం కిరణ్, ఇతర సీనియర్ మంత్రులకు ప్రజలనుంచి నిరసన ఎదురైంది. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కుమార్తె నవ్యత, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వై.శివరామిరెడ్డి కుమారుడు భీమారెడ్డిల వివాహం ఆదివారం అనంతపురంలో వైభవంగా జరి గింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై వధూవ రులను ఆశీర్వదించారు. 
బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.30 గంటలకు అనంతపురానికి చేరుకున్న కిరణ్ నేరుగా వివాహవేదిక ఎంజీఆర్ కల్యాణమంటపం వద్దకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.11 గంటలకు తిరిగి వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి రోడ్డుమార్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి ముహూర్తం 10.30 గంటలు.. భోజ నాలు 11.30 గంటలకే పూర్తయ్యాయి. వధూవరులు నవ్యత, భీమారెడ్డిలు జగన్ వచ్చేవరకూ వేదికపైనే ఉండిపోయారు. వారితోపాటు వివాహానికి హాజరైన ప్రజలూ జగన్‌మోహన్‌రెడ్డి కోసం వేచి చూశారు. ఆయున చిరుమందహాసంతో.. అభివాదం చేస్తూ ప్రజలను అనునయించారు. అక్కడి నుంచి లలిత కళాపరిషత్‌కు చేరుకున్న ఆయున చీమలవాగుపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి మేనకోడలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత డాక్టర్ కే తిరెడ్డి మోహన్‌రెడ్డి నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెమోరియల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి నివాసానికి చేరుకుని, తర్వాత పులివెందులకు బయలుదేరి వెళ్లారు. 
కరచాలనంలో అపశ్రుతి..

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వచ్చిన వెంటనే పెద్దఎత్తున కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ ఆయన కుడిచేయిని చాలా మంది ఒకేసారి లాగడంతో విద్యార్థుల గోళ్లు గీసుకుని స్వల్ప గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది విద్యార్థులను అడ్డుకుని జగన్‌మోహన్‌రెడ్డి చేతికి ప్రథమ చికిత్స చేశారు. 

No comments:

Post a Comment