Pages

Tuesday, May 17, 2011

కేంద్ర, రాష్ట్రాలు కళ్లు తెరవాలి: జగన్



గుంటూరు : ‘మా గోడు వినండి అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 48 గంటల పాటు చేసిన దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మంగళవారం ఆయన రైతు దీక్షా సభాస్థలిలో రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతు మోమున చిరునవ్వు ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికి మద్దతు ధర రూ.530 నుంచి వెయ్యికి పెరిగిందన్నారు. రాముని రాజ్యమైతే చూడలేదు కానీ, రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని చూసానని ఆయన అన్నారు. వైఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో ఆరుశాతం వృద్ధి చెందిందన్నారు.

వైఎస్‌ఆర్ చనిపోయిన తర్వాత రైతును ఆదుకునేవారే లేకపోయారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సీడీ ఇంతవరకూ రైతులకు అందలేదన్నారు. పేదవారిని ఆదుకోవాలన్న తపనకానీ, వైఎస్ ఆకాంక్షలను నెరవేర్చాలన్న ఉద్ధేశ్యం కానీ ప్రభుత్వానికి లేదన్నారు. ఎఫ్‌సీఐ నుంచి ఎందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ సువర్ణ యుగాన్ని మనమే తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

రైతుల పట్ల చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్‌ జగన్ అన్నారు. తాను దీక్ష చేస్తానన్న తర్వాతే చంద్రబాబులో చలనం వచ్చిందన్నారు. వ్యవసాయం దండగన్న ఆయనకు ఇప్పుడు రైతుల సమస్యలు గుర్తుకు వచ్చాయా అని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకపోవటం వల్లే చంద్రబాబు రోడ్డెక్కారని ఎద్దేవా చేశారు. 

No comments:

Post a Comment