నాడు వైఎస్ సువర్ణయుగం నడుస్తున్నప్పుడు 47 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారే.. ఈరోజు 90 మంది ఎమ్మెల్యేలు ఉండీ.. ఈ సర్కారు మాకొద్దని రైతులంటున్నా నోరు మెదపరేం.. {పజల పక్షాన పోరాడాల్సిన మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు అతి త్వరలో రెండు పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోతాయి రాష్ట్రంలో ప్రతిపక్షమేదైనా ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పులివెందుల(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ఈ చేతకాని సర్కారును సాగనంపాలి అని రోడ్డెక్కి మాట్లాడుతున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టట్లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల పక్షాన, రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం.. అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని, అందువల్లే రైతులు, పేదల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని నోటిమాటగా అయితే అంటారుకానీ సాగనంపరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని పెండ్లూరు, చాగలేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సువర్ణయుగం సాగుతున్నప్పుడు.. రైతులకు ఎంఎస్‌పీని మించి ధర 47మంది ఎమ్మెల్యేల బలం కూడా సరిగాలేని చంద్రబాబు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదంటూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ రోజు రోడ్డెక్కి మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న మీకు గుర్తుకు రావట్లేదా చంద్రబాబూ.. ఇవాళ మీకు 90మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతి రైతు సోదరుడు, పేదవాడు ప్రస్తుత ప్రభుత్వం దిగిపోవాలని వేయి కళ్లతో ఎదురుచుస్తున్నాడు.. అయినా మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదు?’ అని జగన్ నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న బాబు.. అవిశ్వాస తీర్మానం పెట్టనుగాక పెట్టనంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కనీస మద్దతు ధర వేయి రూపాయలుగా ఉంది. ఆ ఐదేళ్లలో రూ. 1200 ధరకు కూడా రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఆయన చనిపోయిన తరువాత, సువర్ణ యుగం పోయాక.. కనీస మద్దతు ధర కంటే రూ. 150 నుంచి రూ. 200 తక్కువకు అమ్ముకునే అధ్వాన్న స్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ప్రతిపక్షం, పేదల వ్యతిరేక ప్రభుత్వం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన ప్రతి పేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో ఎప్పుడు కలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో దేవుడు దయ తలిస్తే, వైఎస్ ఆశీస్సులు అందరికీ ఉంటే వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడులన్నీ ఏకమై.. ఇంతమంది పేదల ఉసురుపోసుకున్న ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంగాళాఖాతంలో కలిసి పోతాయని, ఆ రోజు అతి త్వరలో వస్తుందని జగన్ అన్నారు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం క నబడడం లేదు. ప్రతిపక్షం ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జనం సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నది మేమే. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ మాది’ అని స్పష్టంచేశారు. అలాంటి నాయకులు కరువయ్యారు ‘రాముని రాజ్యం చూడ లేదు కానీ, రాజశేఖరుని సువర్ణ యుగం చూశాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రేండేళ్లు కావస్తోంది. ఆయన చనిపోయిన తరువాత పేదల మొహంలో చిరునవ్వు చూడాలని, వారి జీవితాలపై చెరగ ని ముద్రవేయాలని.. వారి గుండెల్లో బతికుండాలని, చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫొటో పెట్టుకునేలా వారికి మేలు చేయాలనే తపన రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ లేదు’ అంటూ జగన్ కాంగ్రెస్, టీడీపీ నాయకులనుద్దేశించి విమర్శించారు. మెజార్టీయే సాక్ష్యం ‘వైఎస్ ఎక్కడికీ పోలేదు. ప్రతి గుండెలో బతికే ఉన్నారు. నన్నూ, నా తల్లినీ ఒంటరిని చేయకుండా ఇంత పెద్ద కుటుంబాన్నిచ్చారు’ అని ప్రజాస్పందనను చూసి జగన్ ఉద్వేగంగా అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీయే ఇందుకు సాక్ష్యమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలే రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికాయన్నారు. 20 మంది మంత్రులు మకాం వేసినా, హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి ఆత్మాభిమానానికి వేలం వేసి కొనాలని చూసినా.. వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈ జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్న కడప బిడ్డలు.. రాష్ట్రంలో, దేశంలో అందరూ చూసేటట్లు గర్వింప దగ్గ తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల రోజున చూపిన ప్రేమాభిమానాలే ఇప్పుడు కూడా చూపుతున్నారని.. చిరునవ్వుతో ఆప్యాయత, అభిమానం పంచుతున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
Saturday, May 21, 2011
మ్యాచ్ ఫిక్సింగ్ బాబూ... అవిశ్వాసం పెట్టరేం?
Wednesday, May 18, 2011
‘మాసీమ’ కుటుంబానికి జగన్ పరామర్శ
కడప :సీనియర్ పాత్రికేయుడు, రాయలసీమ ఉద్యమనేత మాసీమ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. |
Tuesday, May 17, 2011
రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు
* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...
గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.
రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.
నేను కదిలే వరకూ.. బాబు కదలరు
ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.
ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.
ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా
ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.
మద్దతు ధర 100 పెంచాలి
ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.
స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.
పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.

కేంద్ర, రాష్ట్రాలు కళ్లు తెరవాలి: జగన్
గుంటూరు : ‘మా గోడు వినండి అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 48 గంటల పాటు చేసిన దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంగళవారం ఆయన రైతు దీక్షా సభాస్థలిలో రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతు మోమున చిరునవ్వు ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికి మద్దతు ధర రూ.530 నుంచి వెయ్యికి పెరిగిందన్నారు. రాముని రాజ్యమైతే చూడలేదు కానీ, రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని చూసానని ఆయన అన్నారు. వైఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో ఆరుశాతం వృద్ధి చెందిందన్నారు.
వైఎస్‌ఆర్ చనిపోయిన తర్వాత రైతును ఆదుకునేవారే లేకపోయారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సీడీ ఇంతవరకూ రైతులకు అందలేదన్నారు. పేదవారిని ఆదుకోవాలన్న తపనకానీ, వైఎస్ ఆకాంక్షలను నెరవేర్చాలన్న ఉద్ధేశ్యం కానీ ప్రభుత్వానికి లేదన్నారు. ఎఫ్‌సీఐ నుంచి ఎందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ సువర్ణ యుగాన్ని మనమే తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
రైతుల పట్ల చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. తాను దీక్ష చేస్తానన్న తర్వాతే చంద్రబాబులో చలనం వచ్చిందన్నారు. వ్యవసాయం దండగన్న ఆయనకు ఇప్పుడు రైతుల సమస్యలు గుర్తుకు వచ్చాయా అని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకపోవటం వల్లే చంద్రబాబు రోడ్డెక్కారని ఎద్దేవా చేశారు.
Monday, May 16, 2011
రైతు పోరు, జనహోరు
రెండో రోజూ ‘రైతు దీక్ష’కు పోటెత్తిన అన్నదాతలు
వినతిపత్రాలిచ్చి తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
జగన్ వెంటే నడుస్తానన్న మంత్రి ధర్మాన సోదరుడు, నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్
నేడు 12 గంటలకు దీక్ష విరమణ
గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘బాబూ.. కాస్త దారిస్తారా..? జగన్ బాబును కలవాలి. ఆ మా రాజుకు ఈ కాగితం ఇచ్చెల్తా..! ఇంతమంది జనంలో కూడా ఎలాగోలా ఇక్కడ్దాక వచ్చా.. ఇంక నడవలేను సామి. కాస్త, ఆ బాబు దగ్గర్కి తీసుకెళ్లండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వృద్ధ రైతు పేరం ముసలయ్య ఎట్టకేలకు జగన్ దగ్గరకు చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు ముసలయ్య మూడెకరాల పంటను నష్టపోయాడు. సర్కారు నుంచి ఎలాంటి సాయం లేని నేపథ్యంలో జగన్‌కు తన ఆవేదనను తెలియచేసేందుకు అతడు దీక్షకు వచ్చాడు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రమిచ్చాడు.
ఇలాంటి వృద్ధ, యువ, మహిళా రైతులు గుంటూరులో సోమవారం రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చారు. జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కాకపోయినా.. జగన్‌కు తమ సమస్యలు చెప్పుకొంటే వాటి పరిష్కారానికి ఆయన తమ తరఫున పోరాడతారన్న నమ్మకమే 70 ఏళ్ల వయసున్న వారిని సైతం ‘రైతు దీక్ష’కు లాక్కొచ్చింది. 48 గంటల రైతు దీక్షలో రెండోరోజైన సోమవారమిలా రైతులు, అభిమానులు, మద్దతు తెలిపేవారితో దీక్షా ప్రాంగణం పోటెత్తింది. రైతులు వ్యవసాయ పరిస్థితుల్ని, నష్టపోయిన తీరును.. తమను పట్టించుకోని అధికారుల వైఖరిపై జగన్‌కు వినతిపత్రాలు అందించారు. మహిళలు సైతం పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. పావలావడ్డీ, అభయహస్తం, రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను తమ అభిమాన నేత జగన్‌కు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్‌ను కలిసేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ కోసం నేనున్నాంటూ ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.
అదే ఓర్పు.. అదే చిరునవ్వు: ఆదివారం మధ్యాహ్నం నుంచీ తిండీ తిప్పలు లేకున్నా.. కరచాలనానికి జనం పోటెత్తుతున్నా.. జగన్ పెదాలపై చిరునవ్వు చెరగలేదు.. తనతో మాట్లాడ్డానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. క్యూలో వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ.. వారు చెప్పుకునే సమస్యల్ని సావధానంగా విన్నారు. అందరు రాజకీయ నేతల్లా కాకుండా.. వినతిపత్రాల్ని ఆయన చదువుతూ ఉండటం అభిమానుల్ని సంతృప్తిపరిచిన అంశమని చెప్పాలి. రైతన్నల చేతుల్లో చేయి కలిపి నేనున్నానంటూ భరోసానివ్వడం వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కదిలిన మహిళా లోకం: ఎర్రని సూరీడు అగ్నిగోళంలా మండుతూ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరినా లెక్కచేయక మహిళలు వడివడిగా వైఎస్సార్ రైతు ప్రాంగణానికి చేరుకున్నారు. వారు వేల సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల ఆకాంక్షను నెరవేర్చారు. ఓవైపు వేదికపై ప్రజా కళాకారులు పాటలు ఆలపిస్తుండగా, క్యూల్లో నిల్చొన్న రైతులు, అభిమానులు కూడా వారికి వంతపాడుతూ జేజేలు పలికారు.
రహదారులన్నీ గుంటూరు వైపే: సోమవారం రాష్ట్ర రహదారులన్నీ గుంటూరువైపే మళ్లాయి. కృష్ణా, ప్రకాశం, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి తరలి వచ్చారు. వీరుకాక ఖమ్మం, ఆదిలాబాద్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
ప్రజాప్రతినిధుల హాజరు: రెండో రోజు దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధుల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోష్(రామచంద్రపురం), కొండా సురేఖ (పరకాల), ఎమ్మెల్యేలు తె ల్లం బాలరాజు(పోలవరం), కొర్ల భారతి(టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కె.శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), అమర్‌నాథరెడ్డి(రాజంపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బాబూరావు (పాయకరావుపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకాశేషుబాబు తదితరులున్నారు.
మిర్చి రైతులను ఆదుకోండి..
ఇన్‌చార్జి కలెక్టర్‌కు జగన్ ఫోన్
గుంటూరు, న్యూస్‌లైన్: ‘మిర్చి రైతుల్ని ఆదుకోండి.. అప్పులు చేసి పండించిన పంటను ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ధర సంగతి ఎలా ఉన్నా ఒక్క కాయ కూడా మిగలకుండా మొత్తం బూడిదైంది. గుంటూరులో వరుసగా కోల్డ్ స్టోరేజీలు తగులబడటంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతీ రైతుకు పారదర్శకంగా పరిహారం అందించాలి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ను కోరారు. ఆదివారం రాత్రి గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంలో ఉన్న వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నికి ఆహుతై వందలాదిమంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులు కలిసి న్యాయం చేయాలంటూ విన్నవించారు. తక్షణమే స్పందించిన జగన్.. అప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. నష్టపోయిన ప్రతి రైతును రికార్డుల ఆధారంగా గుర్తించి పరిహారం తక్షణమే అందించాలని, జాప్యం జరిగినా, రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తానని చెప్పారు. కాగా మిర్చి రైతులకు అండగా వైఎస్ జగన్ ఉంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. జేసీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సారాంశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రైతులకు వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే మళ్ళీ మళ్ళీ జగన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని చెప్పారు.
నేడు 12 గంటలకు దీక్ష విరమణ
వైఎస్ జగన్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. దీక్ష విరమణకు ముందు జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.

Subscribe to:
Comments (Atom)