Monday, May 16, 2011
రైతు పోరు, జనహోరు
రెండో రోజూ ‘రైతు దీక్ష’కు పోటెత్తిన అన్నదాతలు
వినతిపత్రాలిచ్చి తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
జగన్ వెంటే నడుస్తానన్న మంత్రి ధర్మాన సోదరుడు, నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్
నేడు 12 గంటలకు దీక్ష విరమణ
గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘బాబూ.. కాస్త దారిస్తారా..? జగన్ బాబును కలవాలి. ఆ మా రాజుకు ఈ కాగితం ఇచ్చెల్తా..! ఇంతమంది జనంలో కూడా ఎలాగోలా ఇక్కడ్దాక వచ్చా.. ఇంక నడవలేను సామి. కాస్త, ఆ బాబు దగ్గర్కి తీసుకెళ్లండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వృద్ధ రైతు పేరం ముసలయ్య ఎట్టకేలకు జగన్ దగ్గరకు చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు ముసలయ్య మూడెకరాల పంటను నష్టపోయాడు. సర్కారు నుంచి ఎలాంటి సాయం లేని నేపథ్యంలో జగన్‌కు తన ఆవేదనను తెలియచేసేందుకు అతడు దీక్షకు వచ్చాడు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రమిచ్చాడు.
ఇలాంటి వృద్ధ, యువ, మహిళా రైతులు గుంటూరులో సోమవారం రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చారు. జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కాకపోయినా.. జగన్‌కు తమ సమస్యలు చెప్పుకొంటే వాటి పరిష్కారానికి ఆయన తమ తరఫున పోరాడతారన్న నమ్మకమే 70 ఏళ్ల వయసున్న వారిని సైతం ‘రైతు దీక్ష’కు లాక్కొచ్చింది. 48 గంటల రైతు దీక్షలో రెండోరోజైన సోమవారమిలా రైతులు, అభిమానులు, మద్దతు తెలిపేవారితో దీక్షా ప్రాంగణం పోటెత్తింది. రైతులు వ్యవసాయ పరిస్థితుల్ని, నష్టపోయిన తీరును.. తమను పట్టించుకోని అధికారుల వైఖరిపై జగన్‌కు వినతిపత్రాలు అందించారు. మహిళలు సైతం పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. పావలావడ్డీ, అభయహస్తం, రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను తమ అభిమాన నేత జగన్‌కు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్‌ను కలిసేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ కోసం నేనున్నాంటూ ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.
అదే ఓర్పు.. అదే చిరునవ్వు: ఆదివారం మధ్యాహ్నం నుంచీ తిండీ తిప్పలు లేకున్నా.. కరచాలనానికి జనం పోటెత్తుతున్నా.. జగన్ పెదాలపై చిరునవ్వు చెరగలేదు.. తనతో మాట్లాడ్డానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. క్యూలో వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ.. వారు చెప్పుకునే సమస్యల్ని సావధానంగా విన్నారు. అందరు రాజకీయ నేతల్లా కాకుండా.. వినతిపత్రాల్ని ఆయన చదువుతూ ఉండటం అభిమానుల్ని సంతృప్తిపరిచిన అంశమని చెప్పాలి. రైతన్నల చేతుల్లో చేయి కలిపి నేనున్నానంటూ భరోసానివ్వడం వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కదిలిన మహిళా లోకం: ఎర్రని సూరీడు అగ్నిగోళంలా మండుతూ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరినా లెక్కచేయక మహిళలు వడివడిగా వైఎస్సార్ రైతు ప్రాంగణానికి చేరుకున్నారు. వారు వేల సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల ఆకాంక్షను నెరవేర్చారు. ఓవైపు వేదికపై ప్రజా కళాకారులు పాటలు ఆలపిస్తుండగా, క్యూల్లో నిల్చొన్న రైతులు, అభిమానులు కూడా వారికి వంతపాడుతూ జేజేలు పలికారు.
రహదారులన్నీ గుంటూరు వైపే: సోమవారం రాష్ట్ర రహదారులన్నీ గుంటూరువైపే మళ్లాయి. కృష్ణా, ప్రకాశం, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి తరలి వచ్చారు. వీరుకాక ఖమ్మం, ఆదిలాబాద్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
ప్రజాప్రతినిధుల హాజరు: రెండో రోజు దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధుల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోష్(రామచంద్రపురం), కొండా సురేఖ (పరకాల), ఎమ్మెల్యేలు తె ల్లం బాలరాజు(పోలవరం), కొర్ల భారతి(టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కె.శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), అమర్‌నాథరెడ్డి(రాజంపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బాబూరావు (పాయకరావుపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకాశేషుబాబు తదితరులున్నారు.
మిర్చి రైతులను ఆదుకోండి..
ఇన్‌చార్జి కలెక్టర్‌కు జగన్ ఫోన్
గుంటూరు, న్యూస్‌లైన్: ‘మిర్చి రైతుల్ని ఆదుకోండి.. అప్పులు చేసి పండించిన పంటను ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ధర సంగతి ఎలా ఉన్నా ఒక్క కాయ కూడా మిగలకుండా మొత్తం బూడిదైంది. గుంటూరులో వరుసగా కోల్డ్ స్టోరేజీలు తగులబడటంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతీ రైతుకు పారదర్శకంగా పరిహారం అందించాలి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ను కోరారు. ఆదివారం రాత్రి గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంలో ఉన్న వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నికి ఆహుతై వందలాదిమంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులు కలిసి న్యాయం చేయాలంటూ విన్నవించారు. తక్షణమే స్పందించిన జగన్.. అప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. నష్టపోయిన ప్రతి రైతును రికార్డుల ఆధారంగా గుర్తించి పరిహారం తక్షణమే అందించాలని, జాప్యం జరిగినా, రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తానని చెప్పారు. కాగా మిర్చి రైతులకు అండగా వైఎస్ జగన్ ఉంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. జేసీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సారాంశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రైతులకు వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే మళ్ళీ మళ్ళీ జగన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని చెప్పారు.
నేడు 12 గంటలకు దీక్ష విరమణ
వైఎస్ జగన్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. దీక్ష విరమణకు ముందు జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.

పొట్టగొడితే.. పోగాలమే!
* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు
* మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం..
* మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు నిరసన
* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష
* ప్రభం‘జనం’తో కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి
* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో జన హోరు
* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు
‘‘నోటికాడికి ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’
‘‘వైఎస్ ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తోంది.’’
‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’
..ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు.. అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన, ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు.
తమను పట్టించుకోకుండా మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.
రైతు నేతకు నివాళితో దీక్ష ప్రారంభం..
శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు.
అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని రైతులు తమ ఆవేదనను వివరించారు.
మద్దతుగా వేలాదిమంది దీక్ష
దీక్ష ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు.
9 గంటల నుంచే జనహోరు
రైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు, వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం విశేషం.
ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు. ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై జగన్ నినాదాల హోరు మార్మోగింది.
జగన్ మెజార్టీపై అభినందనలు....
రెండురోజుల కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు. జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు చేశారు.
ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..
రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో 98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.

Sunday, May 15, 2011
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: జూపూడి
కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎంఎల్‌సీ జూపూడిప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి నివాసంలో మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జూపూడి మాట్లాడుతూ వైఎస్ కష్టంతో తీసుకొచ్చిన ప్రభుత్వంలో కిరణ్‌కుమార్ రెడ్డికొనసాగే అర్హతలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సూర్యప్రకాశరావు, కేపీహెచ్‌బీ వైఎస్సార్ పార్టీ నాయకుడు జార్జిహెర్బెట్, సుబ్బలక్ష్మీ, రాంబాబు, మనోహర్, చంద్రశేఖర్, మల్లిఖార్జున్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయంతో అన్నదానాలు
లింగాల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వై.ఎస్.విజయమ్మ, వై.ఎస్.జగన్‌రెడ్డి ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో లింగాల మండలంలో భారీగా డిన్నర్లు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తేర్నాంపల్లె గ్రామంలో గంగాధరరెడ్డి, వెలిదండ్ల గ్రామంలో విశ్వరూప జనార్థన్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు. అంబకపల్లెలో మురళీకృష్ణారెడ్డి, బాబురెడ్డి గ్రామంలో జాకెట్లు పంపిణీ చేశారు.
వృద్ధులకు స్వీట్లు పంపిణీ
పులివెందుల అర్బన్: చిన్నరంగాపురం గ్రామం వద్ద ఉన్న లీలావతి వృద్ధాశ్రమంలో మాజీ ఎంపీపీ ఈసీ గంగిరెడ్డి వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. సేవా అమృత హస్తం అధ్యక్షుడు రాజు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగాపురం సర్పంచ్ ఆదిశేషారెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో..
చక్రాయపేట,న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గండి అంజన్న సన్నిధిలో విజయోత్సవాలను నిర్వహించారు. పాలయ్యగారిపల్లెకు చెందిన రామగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్.వరదారెడ్డి, పీ.శివారెడ్డి, సుఖవరదారెడ్డి,సిద్దారెడ్డి, కదిరి నరసింహారెడ్డి, ఎల్‌జీ వరదారెడ్డి 1008 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే చక్రాయపేట మండలం కె ఎర్రగుడి గ్రామ సర్పంచ్ సూర్యకాంతమ్మ ఆమె భర్త రఘునాథరెడ్డి, సిద్దారెడ్డి, సరోజమ్మ, శ్రీరాములురెడ్డి, చెన్నక్రిష్ణమనాయుడు, సూర్యభాస్కర్‌నాయుడు, గఫూర్, సుధాకర్‌రెడ్డి, భా స్కర్‌నాయక్, నాయుడు, నాయక్, ఎం. రామచంద్రారెడ్డి, సరోజమ్మ, శ్రీనివాసులురెడ్డి, తిరుమలరెడ్డి, పెద్ద ఉత్తయ్య, రమణయ్య కలసి 303 కొబ్బరికాయలు కొట్టారు. మాజీ జడ్పీటీసీ స భ్యుడు జయచంద్ర తలనీలాలు సమర్పించారు.
మైనార్టీల అభిమానం
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్, వై.ఎస్.విజయమ్మలు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పట్టణంలో మైనార్టీ నాయకుడు ఎస్‌ఎం నూరుల్లా ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ నయూమ్, బషీర్, పండు, రోషిత్, అమీర్, కాదర్‌బాషా, కలంధర్, ఒసామా, ఖాదురు, అహ్మద్, జాకీర్, నూరు, ఖాదర్‌బాషా (అప్పు) పాల్గొన్నారు.
స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
కడప అగ్రికల్చర్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే యువనేత జగన్‌తోనే సాధ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రే కం సుబ్బరాయుడు తెలిపారు. శనివారం నగరంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 501 టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేకం శివయ్య, ఆంజనేయులు, రాజా, గంగిరెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్, సుబ్బారెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

బిజీబిజీగా ఎంపీ జగన్
పులివెందుల అర్బన్ /టౌన్, న్యూస్‌లైన్ : ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అభిమానులను ఆప్యాయంగా పలుకరించారు. పులివెందుల, తొండూరులో పెళ్లిళ్లకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.
కిటకిటలాడిన జగన్ నివాసం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పులి వెందుల నియోజకర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తండోప తండాలుగా తరలి వచ్చారు. జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. చాలామంది వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారందరినీ ఆయన పేరుపేరునా పలుకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కూడా పలు విషయాలపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో వేముల మాజీ ఎంపీపీ జనార్థన్‌రెడ్డి, సింహాద్రిపురం మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డి, చక్రాయపేట ప్రవీణ్, గురిజాల భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
జగన్‌ను కలిసిన నాయకులు
పులివెందులలోని వైఎస్ ప్రకాష్‌రెడ్డి స్వగృహంలో శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు పట్టణ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధు, డాక్టర్ ఇసి గంగిరెడ్డి పలు విషయాలపై చర్చించుకున్నారు. వీరితోపాటు అంబకపల్లె మురళి, తేలూరు శివరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ర మణారెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, మాజీ కౌన్సిలర్ నాగభూషణం, మనోహర్, చిన్నప్ప తదితరులు ఉన్నారు.
తిరుపతి లడ్డూ తినిపించిన చెవిరెడ్డి
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ప్రసాదాన్ని జగన్‌కు తినిపించారు.
వధూవరులకు జగన్ ఆశీర్వాదం
పట్టణంలోని పాల్‌రెడ్డి పంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన స్థానిక ఎర్రగుడిపాలెంకు చెందిన కోళ్ల భాస్కర్ అన్న చిన్నన్న కుమార్తె శివమల్లేశ్వరి, శివప్రసాద్‌ల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారి బంధుమిత్రులను ఆప్యాయంగా పలుకరించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహ ర్‌రెడ్డి, ఇసి గంగిరెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సూరి, భాస్కర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తొండూరులో..
స్థానిక టీటీడీ కల్యాణ మంటపంలో తొండూరు ఎంపీటీసీ కుమారుడు పాములేటి, నాగమణిల వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కల్యాణ మంటపం నుంచి వెలుపలికి రాగానే పెళ్లికి వచ్చినవారు ఆయన కరచాలనం కోసం పోటీపడ్డారు. జగన్‌ను భూజాలపైకి ఎత్తుకుని ‘వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు కార్యకర్తలను ఆయన పేరుపేరునా పిలువడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
షరాబు సంఘం అధ్యక్షుని తండ్రికి నివాళి
పులివెందుల షరాబు సంఘం అధ్యక్షుడు రామమోహన్ తండ్రి కుళ్లాయప్ప(75) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వారింటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు పులివెందుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, షరాబు సంఘం స్వర్ణ కారుల సంఘం నాయకులు ఉన్నారు

అన్నదాతకు అండగా జగన్
గుంటూరు సెంట్రల్, న్యూస్‌లైన్: రాష్ట్ర భావినేత వైఎస్ జగన్ మాత్రమేనని పశ్చిమగోదావరి జిల్లా గణపవరం జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు నవుడు వెంకటరమణ తెలిపారు. గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టనున్న రైతు దీక్షకు తరలివచ్చిన ఆయనదీక్షా ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ఏ మాత్రం గర్వపడకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలోనే ఇలాంటి వ్యక్తి జగన్ ఒక్కరేనన్నారు. యువనేతను సీఎంగా చూసేందుకు రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వాలు అన్నదాతను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ దీక్ష చేపట్టారని చెప్పారు. దీక్షకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. మండుటెండలను లెక్క చేయకుండా రైతు సమస్యల పరిష్కారం కోసం జగన్ పోరాడటం అభినందనీయమన్నారు. |
రైతుదీక్షకు న్యాయవాదుల మద్దతు
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్‌మోహనరెడ్డి గుంటూరులో 48 గంటలపాటు చేపట్టనున్న రైతుదీక్ష కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా లీగల్ సెల్ సంపూర్ణ మద్దతు తెలిపింది. లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అరండల్‌పేట 11/2లోని లీగల్‌సెల్ కార్యాలయం నుంచి దీక్ష శిబిరం వరకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా నల్లకోటు ధరించి ప్రదర్శనలో పాల్గొననున్నారు. |
సచిన్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు
31న సత్కారం
వరల్డ్‌కప్ టీమ్‌నూ సన్మానించనున్న బీసీసీఐ
ముంబై : అవార్డులు, రివార్డులు అతని సొంతం. రికార్డులకు అతనంటే ఎంతో ఇష్టం. ఎన్నో, ఎన్నెన్నో రికార్డుల ను, అవార్డులను సొంతం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచి న్ టెండూల్కర్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. 2009-10 సీజన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సచిన్‌ను పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ అవార్డుతో సత్కరించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈనెల 31న జరిగే బిసీసీఐ నాల్గవ వార్షిక అవార్డు ప్రదాన కార్యక్రమంలో సచిన్‌కు ఈ సత్కారం జరగనుంది. మరో ఆసక్తికర అంశమేంటంటే .. 28 ఏళ్ల తర్వాత వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచిన ధోనీ సేనను కూడా ఈ సందర్భంగా సత్కరించనున్నారు. దీంతో పాటు సీ.కే. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు 15 లక్షల రూపాయల నగదుతో మరో ఆటగాడిని సత్కరించనున్నారు. అతనెవరనేది 27న ప్రకటిస్తామని బిసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. వయసు తేడా ప్రాతిపదికగా.. 2009-10 సీజన్‌లో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు.

వైయస్ జగన్ రైతు దీక్షలో పాల్గొన్న ఆరుగురు ఎమ్మెల్యేలు
గుంటూరు: రైతులకు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన దీక్షలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీల నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు, పుల్లా పద్మావతి, తిప్పారెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణ, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ పీఆర్పీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ, భూమా నాగిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా అంతకుముందు భారీగా అభిమానులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చిన వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేశారు. కాగా అంతకుముందు రైతు నాయకుడు తికాయత్ మృతికి దీక్షలో నివాళులు అర్పించారు. రైతు సంక్షేమం కోసం తికాయత్ జరిపిన ఉద్యమాల గురించి మాట్లాడారు. మూడు నెలల క్రితం చెరకు పంటకు మద్దతు ధర కోరుతూ మూడు లక్షల మంది రైతులతో ఢిల్లీని ముట్టడించిన తికాయత్, తన జీవితంలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Friday, May 13, 2011
Jagan's victory reverberates in Seemandhra
GUNTUR/KAKINADA: It was celebrations all over the coastal and Rayalaseema towns after Jagan and Vijayamma registered emphatic victories on Friday. With many of the party's top leaders including Bhumana Karunakara Reddy, Ambati Rambabu, Y V Subba Reddy were camping in Guntur to oversee the arrangements for the Jagan's proposed 48-hour raithu deeksha from Monday, the jubilations began in the morning and did not end till late in the night. Party workers gathered at many centres and started bursting the crackers.
The towns and villages in Guntur, Prakasam, Anantapur, Kadapa, Kurnool, both Godavari districts reverberated with sounds of anchors as the YSR Congress workers continued the celebrations for several hours. Sweets were distributed at many places and party leaders cut cakes. The party leaders too encouraged the cadres to make the election victories of Jagan and Vijayamma a big one as it would help take the party more into the grassroots.
Party leaders appealed to the cadres to celebrate the occasion in a big way as Jagan emerged as hero of the day. "Jaganmohan Reddy proved all equations wrong and made the 125-year old Congress and 30-year old TDP to bite the dust. He is here to stay and fight for the people," declared party chief spokesperson Ambati Rambabu. He asked Kamalapuram MLA Veerasiva Reddy and minister D L Ravindra Reddy to give up their assets to the TTD as per their vows made before the elections.
Meanwhile, the arrangements at the raithu deeksha pranganam were going on at a brisk pace after the party leaders decided to organise it a private land instead of BR Stadium. Party leaders Karunakara Reddy, MP Rathaiah, Marri Rajasekhar, Ravi Venkata Ramana, Lella Appireddy visited the site and asked the contractor to speed up the works, erecting tents and dais.

Subscribe to:
Comments (Atom)